తెలంగాణలో కరోనా: 98.97% రికవరీ -కొత్తగా 150 కేసులు -మరో ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెలువరించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది..
కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారు. దీంతో ఇప్పటిదాకా సంభవించిన కరోనా మరణాల సంఖ్య 1610కు చేరింది. కాగా, రికవరీల్లో జాతీయ సగటును మించి తెలంగాణలో రోగులు కోలుకోవడం గమనార్హం..
నిన్న ఒక్కరోజే 186 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,92,032 మంది క్యూర్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.2 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం అది 98.97 శాతంగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక
హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు
ప్రస్తుతం తెలంగాణలో కేవలం 1939 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అందులో 808 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 25 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10 కొత్త కేసులు వచ్చాయి. ఐదు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. మిగత 26 జిల్లాల్లో కొత్త కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి.మరోవైపు..

తెలంగాణలో రెండో విడత కరోనా టీకాల పంపిణీ శనివారమే ప్రారంభమైంది. ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందితోపాటు పోలీసులకూ వ్యాక్సిన్లను అందజేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 15,437 మంది కరోనా టీకా తీసుకున్నారని, ఇప్పటిదాకా మొత్తం 2,08,922 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
భారత్లో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 12,059 కేసులు -97.19% రికవరీలు -13 నుంచి మళ్లీ టాకాలు