Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనేక సమస్యలపై విజ్ఞప్తులు అందుతున్నాయి.!సైబరాబాద్ గ్రీవెన్స్ సెల్ పై సీపి సమీక్షా సమావేశం.!

హైదరాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణలో సైబరాబాద్ కమీషనరేట్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలోని ప్రజల సమస్యలకు పరిష్కారం, అనుమతులు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్థిక నేరాలు, ఆన్ లైన్ మోసాలు, విద్యార్థుల సమస్యలతో పాటు ఇతరత్రా అంశాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు ఊహించని స్పందన వస్తున్నట్టు పోలీసు ఉన్నతాదికారులు స్పష్టం చేస్తున్నారు. సామాన్య పౌరులు తమ సమస్యలను చెప్పుకోవడానికి సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ఎంతో ఉపయుక్తంగా ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

గ్రీవెన్స్ సెల్ కి మంచి ఆదరణ.. కొనసాగించాలన్న సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర

గ్రీవెన్స్ సెల్ కి మంచి ఆదరణ.. కొనసాగించాలన్న సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర

అంతే కాకుండా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిదిలోని డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే కాకుండా పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ఎంతో ఉపమోగపడుతుందని స్పష్టం చేసారు. వేగంగా విస్తరిస్తున్న నగరంలో అంతే వేగంగా పురుగుతున్న జనాబా అవసరాలకనుగుణంగా పోలీసులు కూడా తగిన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్టీఫెన్ రవీంద్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

అనేక సమస్యలకు గ్రీవెన్స్ సెల్ పరిష్కారం.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న కమీషనర్

అనేక సమస్యలకు గ్రీవెన్స్ సెల్ పరిష్కారం.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న కమీషనర్

ఇదిలా ఉండగా పోలీసు సిబ్బంది నుంచి కూడా గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు స్టీఫెన్ రవీంద్ర. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు స్టీఫెన్ రవీంద్ర. ఈరోజు ముఖ్యంగా హెచ్ఆర్ఎమ్ఎస్, సేవా పథకాల ప్రపోజల్స్, సినిమాటోగ్రఫీ పర్మిషన్లు, ఈవెంట్ పర్మిషన్లు, పెట్రోలియం పర్మిషన్లు తదితర అంశాలకు సంబంధించి విజ్ఞప్తులు వచ్చాయని కమీషన్ స్పష్టం చేసారు.

ప్రజల విజ్ఞప్తులపై వేగంగా స్పందించాలి.. పోలీసు కుంటుంబాల డెత్ బెన్పిట్స్ ని వెంటనే అందించాలన్న సీపీ

ప్రజల విజ్ఞప్తులపై వేగంగా స్పందించాలి.. పోలీసు కుంటుంబాల డెత్ బెన్పిట్స్ ని వెంటనే అందించాలన్న సీపీ

అంతే కాకుండా గ్రీవెన్స్ సెల్ లో వచ్చిన అన్ని విజ్ఞప్తులపైన చర్చించినట్టు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. హెచ్ఆర్ఎమ్ఎస్ అప్లికేషన్లను వినియోగం పెంచి, తగిన విధంగా హెచ్ఆర్ఎమ్ఎస్ మాడ్యూల్ లపై ట్రైనింగ్ సెషన్లను ఏర్పాటు చేసి సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు సైబరాద్ కమీషనర్. గడచిన రెండు ఏళ్లల్లో మరణించిన పోలీసు కుటుంబాలకు అందాల్సిన టర్మినల్ డెత్ బెనిఫిట్స్ త్వరితగతిన అందేల ప్రాసెసింగ్ చేయాలన్నారు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర. సీఏఓ లు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు కమీషన్ స్టీఫెన్ రవీంద్ర.

ఏ సమస్య ఉన్నా తన దృష్టి తేవాలన్న సీపీ.. క్రిందిస్ధాయి ఉద్యోగులకు భరోసా ఇచ్చిన కమీషనర్

ఏ సమస్య ఉన్నా తన దృష్టి తేవాలన్న సీపీ.. క్రిందిస్ధాయి ఉద్యోగులకు భరోసా ఇచ్చిన కమీషనర్

సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ ( 8333993272) ద్వారా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఈ సమావేశంలో సైబరాబాద్ శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ శ్రీమతి రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., విమెన్ మరియు చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ శ్రీమతి అనసూయ, బాలానగర్ డీసీపీ శ్రీమతి పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీలు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+