Pushpa2: ఇష్టం లేకపోయినా రష్మిక-స్మగ్లర్ హీరో ఏంటి ? నారాయణ షాకింగ్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్ర నిర్మాణం దగ్గరి నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీపీఐ నారాయణ మరోసారి ఘాటుగా స్పందించారు. అందులో హీరోయిన్ రష్మిక సైతం తనకు ఇష్టం లేకుండానే నటించిందంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దర్శకుడు సుకుమార్ పైనా, ఈ సినిమా బెనిఫిట్ షోలకు, రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చిన ప్రభుత్వంపైనా నారాయణ రెచ్చిపోయారు.

ఎర్రచందనం స్మగ్లర్ ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని, ఇలాంటి వాటికి బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతిచ్చి మరింత తప్పు చేసిందని సీపీఐ నారాయణ తెలిపారు. సంధ్య ధియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి 5కోట్లు ఇచ్చినా ఆమెను తిరిగి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎవరి బాధ్యతలు వారు సరిగ్గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్ కు నారాయణ సూచించారు.

cpi Narayana sensational remarks on pushpa 2 movie rashmika acted against will govt s mistake

పుష్ప2 లాంటి కథతో తీసే సినిమాలు ప్రజలను తప్పుడు దారి పట్టించే విధంగా ఉంటాయని సీపీఐ నారాయణ విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్‌ని హీరోగా చూపించడం ఏమిటని ప్రశ్నించారు, అలాంటి సినిమాలో రష్మిక లాంటి హీరోయిన్‌ ఇష్టం లేకుండానే ఆత్మాభిమానాన్ని చంపుకొని డైరెక్టర్ చెప్పినట్లుగా చేసిందన్నారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో అందరి తప్పు ఉందని నారాయణ తెలిపారు. వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వడం అంటే బ్లాక్ ‌‍మార్కెట్‌ని ప్రోత్సహిస్తున్నట్లే అన్నారు.

ప్రభుత్వం సమాజానికి పనికొచ్చే సినిమాలు, సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలకు బెనిఫిట్ షోలో, పన్ను రాయితీలు ఇవ్వాలి తప్ప ఇలాంటి స్మగ్లింగ్ స్టోరీలతో తీసే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోమని అనుమతులు ఇవ్వకూడదన్నారు. మరోవైపు ఇవాల టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంపైనా స్పందించిన నారాయణ.. ఈ చర్చల వల్ల భవిష్యత్తులో ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+