‘ఇదే నిదర్శనం’: హైదరాబాద్‌లో సిపిఐ నారాయణ ఓటు గల్లంతు
హైదరాబాద్: జిహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు అంశం మరోసారి వివాదాస్పదమైంది. ఇప్పటికే పలువురు తమ ఓట్లు తొలగించారంటూ ఫిర్యాదు చేస్తుండగా, తాజాగా సీపీఐ సీనియర్ నేత నారాయణ, ఆయన సతీమణి వసుమతి ఓట్లను సర్వే అధికారులు తొలగించారు.
బషీర్‌బాగ్‌లోని బిఎన్‌రెడ్డి టవర్స్ ఫ్లాట్ నెం.104లో నారాయణ నివాసముంటున్నారు. ఓటరు జాబితాలో తనపేరు లేకపోవడాన్ని చూసి నారాయణ ఆశ్చర్యానికి గురయ్యారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయనడానికి తన ఓటు తొలగింపే నిదర్శనమన్నారు. దీనిపై జిహెచ్‌ఎంసి అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications