హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేటి నుంచే నోట్ల మార్పిడి: బ్యాంకుల వద్ద బారులు, కొత్తనోట్ల సంబరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేటి నుంచి రూ. 500, 1000 నోట్లను బ్యాంకులలో మార్చుకునేందుకు కేంద్రం అనుమతి కల్పించడంతో గురువారం తెల్లవారుజాము నుంచే ప్రజలు బ్యాంకులకు బయల్దేరారు. హైదరాబాద్ నగరంలో అయితే.. బ్యాంకులు తెరిచే సమయానికి క్యూలైన్లలో ప్రజలు బారులు తీరారు.

నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్యాంకులకు భారీగా జనం వస్తుండటంతో బ్యాంకుల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, ఖాతా నుంచి నేరుగా డబ్బులు తీసుకోవాలంటూ రూ. 10వేల పరిమితి ఉంది. వారంలో రూ.20వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. రూ. 4వేల వరకు బ్యాంకు నుంచి డ్రా చేసుకునే అవకాశం ఉంది.

నోట్ల మార్పిడి సమయంలో ఏదైనా గుర్తింపు కార్డును తప్పని సరిగా తీసుకురావాలని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఎల్లుండి నుంచి రూ. 500, 1000 నోట్లు పూర్తిగా రద్దు కానున్నాయి. రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ నోట్లు చెల్లుబాటయ్యే అవకాశం ఉంది.

నేటి నుంచే నోట్ల మార్పిడి

నేటి నుంచే నోట్ల మార్పిడి

నేటి నుంచి రూ. 500, 1000 నోట్లను బ్యాంకులలో మార్చుకునేందుకు కేంద్రం అనుమతి కల్పించడంతో గురువారం తెల్లవారుజాము నుంచే ప్రజలు బ్యాంకులకు బయల్దేరారు. హైదరాబాద్ నగరంలో అయితే.. బ్యాంకులు తెరిచే సమయానికి క్యూలైన్లలో ప్రజలు బారులు తీరారు.

బ్యాంకుల వద్ద బారులు

బ్యాంకుల వద్ద బారులు

తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ బ్యాంకు చూసినా జనంతో కిటకిటలాడుతోంది. తమ వద్ద ఉన్న రూ. 500, 1000 నోట్లను తీసుకుని బ్యాంకుల వద్దకు చేరుకున్న జనం.. కొత్త నోట్లను, రూ. 100 నోట్లను తీసుకుంటున్నారు. కొందరు తమ ఉన్న ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నారు.

 కొత్త నోట్ల సంబరం

కొత్త నోట్ల సంబరం

కాగా, కొత్తగా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన రూ. 2000ల నోట్లను బ్యాంకు నుంచి తీసుకున్న కొందరు ఆనందం వ్యక్తం చేశారు. భద్రత పరంగా నోటు బాగుందని చెప్పారు. కాగా, శుక్రవారం నుంచి రూ. 500 కొత్త నోట్లు కూడా అమలులోకి రానున్నాయి.

కొంత ఆలస్యంగా..

కొంత ఆలస్యంగా..

చాలా బ్యాంకుల్లో నగదు మార్పిడి జరుగుతున్నప్పటికీ, కొన్ని బ్యాంకులకు నగదు చేరుకోకపోవడంతో మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయితే సాయంత్రం నుంచి నోట్ల మార్పిడి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

భారీ భద్రత

భారీ భద్రత

నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్యాంకులకు భారీగా జనం వస్తుండటంతో బ్యాంకుల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, ఖాతా నుంచి నేరుగా డబ్బులు తీసుకోవాలంటూ రూ. 10వేల పరిమితి ఉంది. వారంలో రూ.20వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. రూ. 4వేల వరకు బ్యాంకు నుంచి డ్రా చేసుకునే అవకాశం ఉంది.

గుర్తింపు కార్డు తప్పనిసరి

గుర్తింపు కార్డు తప్పనిసరి

నోట్ల మార్పిడి సమయంలో ఏదైనా గుర్తింపు కార్డును తప్పని సరిగా తీసుకురావాలని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఎల్లుండి నుంచి రూ. 500, 1000 నోట్లు పూర్తిగా రద్దు కానున్నాయి. రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ నోట్లు చెల్లుబాటయ్యే అవకాశం ఉంది.

English summary
The roads were empty and the banks were filled with people queueing up to exchange their Rs 500 and 1,000 notes after the same had been declared invalid on Tuesday midnight. All banks saw a large number of people queuing up since early morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X