వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా ప్రజలకు కరెంట్ షాక్ .. విద్యుత్ చార్జీల పెంపు, యూనిట్ కు ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ మరియు వంటగ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై పెను భారం మోపేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 14 శాతం మేర విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టిఎస్ఈఆర్సి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వాళ్ళసలు తెలంగాణా బిడ్డలేనా? తెలంగాణా బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహంవాళ్ళసలు తెలంగాణా బిడ్డలేనా? తెలంగాణా బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

 14 శాతం మేర విద్యుత్ ఛార్జీల పెంపుకు టిఎస్ఈఆర్సి గ్రీన్ సిగ్నల్

14 శాతం మేర విద్యుత్ ఛార్జీల పెంపుకు టిఎస్ఈఆర్సి గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెను భారం మోయలేకపోతున్న సామాన్యుడిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో 14 శాతం మేర విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు టిఎస్ఈఆర్సి ప్రకటించింది. గృహ అవసరాల విద్యుత్ కు నలభై నుంచి యాభై పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీల పై యూనిట్ కు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

 తెలంగాణాలో విద్యుత్ చార్జీల పెంపుకు రంగం రెడీ

తెలంగాణాలో విద్యుత్ చార్జీల పెంపుకు రంగం రెడీ


ఇదిలా ఉంటే రాష్ట్రంలో 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపుకు డిస్కంలు టిఎస్ఈఆర్సి కి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. మొత్తం 19 శాతం విద్యుత్ ఛార్జీల పెంపుకు డిస్కంలు అనుమతి కోరగా, 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్సి అనుమతినిచ్చింది. 2021- 22 సంవత్సరానికిగానూ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను పంపాలని ఈఆర్సి డిస్కంలకు వారం రోజుల గడువు ఇస్తూ డిసెంబర్ 21 2021న ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 28వ తేదీన చార్జీల పెంపుకు డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. ఇక వీటిపై తాజాగా ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది.

గృహ వినియోగానికి 50 పైసలు, ఇతర వినియోగాలకు రూపాయి పెంపు

గృహ వినియోగానికి 50 పైసలు, ఇతర వినియోగాలకు రూపాయి పెంపు


గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసలు, ఇతర వినియోగాలకు యూనిట్ కు ఒక రూపాయి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి అని, రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ వెల్లడించారు. గత ఐదు సంవత్సరాల నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఇప్పుడు పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు.

 కేసీఆర్ ఓకే అంటే ఏప్రిల్ నుండి కరెంట్ చార్జీల షాక్

కేసీఆర్ ఓకే అంటే ఏప్రిల్ నుండి కరెంట్ చార్జీల షాక్


ఇప్పటికే తెలంగాణ ఈఆర్సి 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ అనుమతి ఇవ్వగా, దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైనల్ గా నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు పై మొగ్గు చూపితే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కరెంట్ చార్జీల బాదుడు ప్రారంభం కానుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదన పై సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు.

విద్యుత్ చార్జీల పెంపు వద్దని సామాన్యుల విజ్ఞప్తి

విద్యుత్ చార్జీల పెంపు వద్దని సామాన్యుల విజ్ఞప్తి

ఇప్పటికే గత రెండేళ్లుగా కరోనా మిగిల్చిన కష్టాల నుంచి ఇంకా గట్టెక్కలేదని, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇలాంటి సమయంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరవడం భావ్యం కాదని విజ్ఞప్తి చేస్తున్నారు. కరెంట్ చార్జీల బాదుడు తట్టుకోవటం మా వల్ల కాదని అంటున్నారు.

English summary
The Telangana govt will give a current shock to Telangana people. The ERC has already approved the hike in electricity charges. Electricity charges will be increased by 50 paise for household needs and 1 rupee to the others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X