వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని జిల్లాల్లో సైబర్ వింగ్స్: అనురాగ్ శర్మ

అన్ని జిల్లాల్లో సైబర్ వింగ్స్: అనురాగ్ శర్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీల్ని ప్రొత్సహిస్తున్న నేపథ్యంలో ఆనలైన మోసాల బారినపడకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రతి జిల్లాలో త్వరలో సైబర్ వింగ్ ఏర్పా టు చేస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ, నగదు రహిత లావాదేవీలు అనే అంశంపై సీఐడీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆన లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రతల్ని వివరిస్తూ రూపొందించిన పోస్టర్ ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నవారి నుంచి డాటా దొంగిలిస్తూ హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

English summary
Telangana DGP Anurag Sharma said that cyber wings will be establised in the districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X