నా గురించి చాలా మాట్లాడారు, ఫినిష్ అనుకున్నారు: డీఎస్ ఆవేదన
హైదరాబాద్: తన గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకున్నారని తెరాస నేత డీ శ్రీనివాస్ గురువారం నాడు వాపోయారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కెప్టెన్ లక్ష్మీకాంత రావును రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో డీ శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి సేవ చేసే భాగ్యం తనకు కల్పించినందుకు కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు.

తన గురించి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడుకున్నారన్నారు. పని చేసే నేతలకు పదవులు వస్తాయని చెప్పారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తద్వారా ముఖ్యమంత్రికి తోడుగా ఉంటానన్నారు.
బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చునని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ కోసమే కెసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. అందుకే తనకు అవకాశమిచ్చారన్నారు. తెరాసలో చేరితో తన భవిష్యత్తు బాగుండదని చాలామంది అనుకున్నారన్నారు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి వి హనుమంత రావుది. రెండోది గుండు సుధారాణిది. ప్రస్తుతం అధికార తెరాస పార్టీకి బలం ఉంది. రెండు స్థానాలు ఆ పార్టీయే గెలుచుకునే అవకాశాలున్నాయి. అయితే, ఇతర పార్టీల సహకారంతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని యోచిస్తోంది. దీనిపై డీఎస్ మాట్లాడుతూ.. ఎవరైనా పోటీ చేయవచ్చునని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications