కెసిఆర్‌కు షాక్: ఆలోగా బిజెపిలోకి డి శ్రీనివాస్ తనయుడు అరవింద్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిజామాబాద్ జిల్లాలో గట్టి షాక్ తగలనుందా? సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడే మరో పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిజామాబాద్ జిల్లాలో గట్టి షాక్ తగలనుందా? సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడే మరో పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.
చదవండి: సంచలనం: 'టిఆర్ఎస్‌లో అసంతృప్తి, కాంగ్రెస్‌లోకి హరీష్ రావు'

బిజెపిలో చేరనున్న డిఎస్ తనయుడు
టిఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ తనయుడు అరవింద్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఆయన త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.

అమిత్ షా సమక్షంలో చేరిక
ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిసి, ఆయన సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నవయుగ సంస్థ రియల్ డైరెక్టరుగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు రంజీ ఆటగాడిగా కొనసాగారు. కాలికి గాయం కావడంతో ఆ తర్వాత దూరమయ్యారు.

మోడీ అంటే అభిమానం
ఆయన ఆరేళ్ల క్రితమే బిజెపిలో చేరాలనుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఎందుకో చేరలేకపోయారని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే అరవింద్‌కు ఎంతో అభిమానం అని తెలుస్తోంది.

ఆలోగా బిజెపిలోకి
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 17న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిజామాబాద్ రానున్నారు. ఆలోగానే కమలం తీర్థం పుచ్చుకోవాలని అరవింద్ భావిస్తున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications