Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంచలనం: 'టిఆర్ఎస్‌లో అసంతృప్తి, కాంగ్రెస్‌లోకి హరీష్ రావు'

తెలంగాణ మంత్రి హరీష్ రావు గురించి కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    Harish Rao Will Join Congress Party Before 2019 Elections | Oneindia Telugu

    హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు గురించి కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

    చదవండి: నేనేం బంగారం కాదు, చంపేసే సహనం వద్దు, కొట్టమని అర్థమా: పవన్ కళ్యాణ్

    హరీష్ రావు సహా వారు కాంగ్రెస్ పార్టీలోకి

    హరీష్ రావు సహా వారు కాంగ్రెస్ పార్టీలోకి

    అధికార పార్టీలో ఉన్న మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

    బిజెపి ఉనికిలో లేని పార్టీ మేం వెళ్తామా

    బిజెపి ఉనికిలో లేని పార్టీ మేం వెళ్తామా

    కోమటిరెడ్డి సోదరులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి, బిజెపిలోకి వెళ్తారనే ప్రచారంపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. బిజెపి ఉనికిలో లేని పార్టీ అని, తెరాసకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అన్నారు.

    కోదండరాం లాంటి వాళ్లు ఉద్యమబాట

    కోదండరాం లాంటి వాళ్లు ఉద్యమబాట

    మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం లాంటి వాళ్లు మళ్లీ ఉద్యమ బాట పట్టారని కోమటిరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

    కాంగ్రెస్‌ను వీడేది లేదు

    కాంగ్రెస్‌ను వీడేది లేదు

    తాము ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కోమటిరెడ్డి చెప్పారు. పార్టీని బతికించుకునేందుకు కార్యకర్తలతో కలిసి అహర్నిషలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేసిందేం లేదన్నారు.

    పార్టీ చేరికలపై ఇలా ప్రారంభమైంది..

    పార్టీ చేరికలపై ఇలా ప్రారంభమైంది..

    ఇటీవల కాంగ్రెస్, తెరాస నేతల మధ్య జంపింగుల గురించి చర్చ సాగుతోంది. తెరాసలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోందని, ఆ పార్టీలోని కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మల్లు భట్టి విక్రమార్క ఇటీవల అన్నారు. దీనిపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో ఎవరూ చేరరని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలోనే కేవలం ఇద్దరే మిగులుతారని ఎద్దేవా చేశారు. దీనిపై తాజాగా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+