కెటిఆర్! మీ నాన్నను అడుగు!!: ధర్మంద్ర ప్రధాన్ ఫైర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రాలేదని, మోడీ ప్రపంచ దేశాలు తిరుగుతూ పార్లమెంటుకు వచ్చినప్పుడూ సీటు బెల్టు వెతుక్కున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు విమర్శలు చేస్తున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరుచుకుపడ్డారు. కెటీఆర్‌కు అంత అహంకారం పనికిరాదని అంటూ అసలు ప్రధానిని మీరు ఆహ్వానించారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయానికి రావట్లేదంటున్నారని ప్రధానిని విమర్శించేముందు తన తండ్రిని సచివాలయానికి వెళ్లి పనిచేయాలని ఆయన చెప్పాలని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి కోసం పగలు, రాత్రి కృషి చేస్తున్న ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికావని, ప్రధాని మోడీ ఏం చేస్తున్నారో ఆయన తండ్రిని అడగాలని సూచించారు.

మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ధర్మేంద్ర ప్రధాన్‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎ్‌స ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన రాంచంద్రరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రం సాయంతోనే తెలంగాణలో కోతల్లేని కరెంటు వస్తోందని, ఎంఎంటీఎస్ రెండో దశను పూర్తి చేయడానికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడించారు. రాష్ట్ర గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపిస్తే దేశంలోకెల్లా ఒక గొప్ప నగరంగా హైదరాబాద్‌ను తయారుచేయడంలో కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు.

మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ తనకు సవాళ్లు విసురుతున్నారని, తలసానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ నుంచి గెలవాలి. ఆ తర్వాత సవాల్ చేయాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications