ఆన్‌లైన్ ద్వారా మళ్లింపు: కోటికి పైగా కొట్టేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్
సంగారెడ్డి: మెదక్ జిల్లా వ్యవసాయ శాఖలో ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏకంగా కోటి రూపాయలు స్వాహా శాడు. ఈ విషయం గురువారంనాడు వెలుగు చూసింది. రైతులకు సబ్సిడీ పనిముట్లు కొనుగోలు చేసిన ఏజెన్సీలకు చెల్లించాల్సిన కోటీ 3 లక్షల 24 వేల రూపాయలను ఆన్‌లైన్ ఖాతాల ద్వారా మళ్లించినట్లు బయటపడింది.
సంగారెడ్డిలోని వ్యవవసాయ శాఖ సంచాలకుల(జేడీ) కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మాణయ్య అలియాస్ మాణిక్యం జేడీ హుక్యానాయక్ వద్ద 12 ఎస్‌బీఐ చెక్కులను దొంగిలించి ఫోర్జరీ సంతకాలతో నిధులను దారి మళ్లించాడు.

రాష్ర్టీయ కృషి వికాస్ యోజన కింద జిల్లాలోని రైతులకు సబ్సిడీ యంత్రాలు, పనిముట్లను పంపిణీ చేశారు. అయితే, గత డిసెంబరు 31 నుంచి ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో ఈ నిధులను ఇతరుల ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. జేడీ హుక్యానాయక్ గురువారం ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు నిందితుడు మాణయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications