కూతురా.. రాక్షసా.. కాళ్ళ కడియాలు, పించన్ డబ్బుల కోసం తల్లిపై కూతురి కర్కశత్వం!!

చాలామంది కంటే కూతుర్నే కనాలి అంటారు. కూతురైతే తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత సమాజంలో పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. తల్లిదండ్రుల పట్ల దయ, దాక్షిణ్యం ఏమాత్రం లేని కొడుకులు, కూతుళ్ళు తయారవుతున్నారు. తాజాగా కేవలం తల్లి కాళ్ల కడియాలు, పింఛన్ డబ్బుల కోసం విచక్షణరహితంగా ఓ తల్లి ని కూతురు దారుణంగా హింసించిన ఘటన, చావ చితక్కొట్టిన ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఇలాంటి కూతురు ఎవరికి అవసరం లేదు అని అందరూ అనుకునేలా చేస్తుంది.

కాళ్ళ కడియాలు, పింఛన్ డబ్బుల కోసం తల్లిపై రాళ్ళతో దాడి చేసిన కూతురు

కాళ్ళ కడియాలు, పింఛన్ డబ్బుల కోసం తల్లిపై రాళ్ళతో దాడి చేసిన కూతురు

ఇంతకీ ఏం జరిగిందంటే కాళ్ళ కడియాలు,పింఛన్ డబ్బుల కోసం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపై కూతురు తీవ్రంగా దాడికి పాల్పడింది. తనకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా కూతురుదుర్భాషలాడుతూ, చితకబాదిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే వృద్ధురాలికి ఒక్కగానొక్క కూతురు ఉంది. కూతురు ఇంటివద్దే చంద్రమ్మ జీవనం సాగిస్తుంది. తాగుడుకు బానిసైన కూతురు పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవ పడింది. తల్లి కాళ్లకున్న కడియాలను లాక్కోవడం తో పాటు, రాళ్లతో కొడుతూ తల్లిని హింసించింది.

పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు బెదిరించినా కరగని కూతురు

పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు బెదిరించినా కరగని కూతురు

ఇక అటుగా వెళుతున్న కొందరు అత్యంత అమానుషంగా కూతురు తల్లిని కొట్టడం చూసి ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లలో బంధించారు. ఇక ఆ కర్కశత్వాన్ని చూడలేని కొందరు తల్లిని కొట్టడం ఆపాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయినా ఆ కసాయి కూతురు మనసు కరగలేదు. ఎవరు ఎంత తిట్టినా ఆగలేదు. తల్లి పై ఇంకా కర్కశత్వాన్ని ప్రదర్శించిన ఆమె, తల్లిని తీవ్రంగా చితకబాదింది. ఇంకా అదేమంటే తనతల్లి తన ఇష్టం అన్న చందంగా మాట్లాడింది.

కూతురు కొడుతున్న సమయంలో వృద్ధురాలి చేతిలో మనవడు


కూతురు తనను కొడుతున్న సమయంలో చంద్రమ్మ దగ్గర ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు చంద్రమ్మ మనవడు కాగా, ఇక అల్లుడు అక్కడ అంతా జరుగుతున్నా తనకేమి పట్టనట్టు చూస్తూ కూర్చున్నాడు. కనీసం భార్యను కొట్టొద్దు అని వారించలేదు. ఇక దారుణంగా కూతురు వృద్ధురాలిని చితకబాదిన ఘటనను చూసిన స్థానికులు కొందరు చలించిపోయారు. కూతురు కొడుతుంటే ఆ పండు ముసలి అయిన తల్లి దీనంగా రోదించింది.

వృద్దురాలిని కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

వృద్దురాలిని కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు


ఇక కూతురి దాడి నుండి వృద్ధురాలైన తల్లిని సురక్షితంగా వేరే చోటికి తీసుకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చంద్రమ్మను కూతురు తీవ్రంగా హింసించి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీడియో చూసిన వాళ్లంతా అమానవీయంగా ప్రవర్తించిన కూతురిని తిట్టిపోస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+