ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగురవేయడానికి ఇష్టపడుతుంటారు. పండక్కు ముందే గాలిపటాలతో సిద్ధంగా ఉంటారు. అయితే ఎంతో సరదాగా ఆడుకునే ఈ ఆటలో చాలా ప్రమాదం పొంచి ఉంది. పండగ వేళల్లో సరదాగా ఆడే ఈ ఆట కొందరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. దానికి ప్రధాన కారణం గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజా దారమే. రాష్ట్రంలో ఇటీవల చైనా మాంజాతో గాయపడి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా చైనా మాంజాతో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇక తెలంగాణ ప్రభుత్వం 2016 లోనే రాష్ట్రంలో చైనీస్ మాంజాను నిషేధించింది. కానీ చాలా మంది వ్యాపారస్థులు అక్రమంగా వీటి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాను నైలాన్, సింథటిక్ దారంతో తయారు చేస్తారు. చైనీస్ మాంజాతో పక్షులు, మనుషులు ప్రమాదంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ మాంజాపై పోలీసుల దాడులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఉప్పల్ లో మాంజా తగిలి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సాయివర్దన్ రెడ్డి అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా గొంతుకు మాంజా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.
మరో ఘటనలో చైనా మాంజా మెడకు చుట్టుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. చైతన్య అనే యువకుడు గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో అతడి చేయి తెగింది. తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న చైతన్యను స్థానికులు హస్పటల్ కు తరలించారు స్థానికులు.

ఇక మరో ఘటనలో నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్ పై వెళ్తుండగా మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు చైనీస్ మాంజా వినియోగంపై హైదరాబాద్ సిటీ పోలీసుల దాడులు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాపై తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు మా దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల తెలిపారు. ఈ-కామర్స్ వెబ్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఆన్ లైన్ లో నిషేధిత మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సూచనలు చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications