పెళ్లైన వ్యక్తి వేధింపు: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మం: ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. స్రవంతి (20) డిగ్రీ కళాశాలలో బిఎస్సీ మైక్రోబయాలజీ థర్డ్ ఇయర్ చదువుతోంది.
కుమ్మరి రామకృష్ణ అనే వ్యక్తి కొద్ది నెలలుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లి కావడం గమనార్హం. యువతి స్వయంగా పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదు.
శనివారం నాడు కాలేజీకి వెళ్లి ఇంటికి వస్తున్న స్రవంతిని మార్గమధ్యంలో అడ్డుకొని వేధించాడు. తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన స్రవంతి ఆత్మహత్య చేసుకుంది. భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలో మృతి చెందింది.

అప్పుల భాధతో కౌలు రైతు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంలో అప్పుల భాధ తాళలేక కౌలురైతు సత్తయ్య ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడెకరాలు పొలాన్ని కౌలుకుతీసుకున్న సత్తయ్య వరి, పత్తి పంటలను సాగు చేశాడు.
మూడేళ్ల నుంచి అతివృష్టి, అనావృష్టితో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సుమారు ఐదు లక్షల రూపాయల వరకు అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చేదెలాగన్న భాధతో పురుగుల మందు తాగిన సత్తయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెండాడు.












Click it and Unblock the Notifications