కవిత బెయిల్‌పై తేలేది నేడే

Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు.

నిజానికి- కవిత కస్టడీ ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. 9వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారుల కస్టడీకి తరలిస్తూ కిందటి నెల 26వ తేదీన ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టుకోవాల్సి ఉందంటూ ఈడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవిస్తూ ఆ ఆదేశాలు ఇచ్చింది.

Delhi court to hear BRS MLC Kavitha s bail petition today

ఆమె బెయిల్ పిటీషన్‌పై మాత్రం నేడు వాదనలను ఆలకించనుంది రోస్ అవెన్యూ కోర్టు. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఆమె మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉన్నట్లు తాము గుర్తించామని ఇదివరకే ఈడీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్తులను సైతం అటాచ్ చేశారు. వాటి విలువ 128.79 కోట్ల రూపాయలు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు 100 కోట్ల రూపాయల మేర ముడుపులను బదలాయించడంలో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు.

ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉంటోన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. 10 రోజుల పాటు కస్టడీలో ఉండేలా ఆదేశాలను జారీ చేసింది రోస్ అవెన్యూ న్యాయస్థానం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+