డెల్ కంపెనీ జిమ్‌లో వ్యాయామం చేస్తూ టెక్కీ మృతి

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాను పనిచేస్తున్న కంపెనీలోని జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కూప్పకూలిపోయారు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు.

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకరు తాను పనిచేస్తున్న కంపెనీలోని జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. దీంతో అతడిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పకి తరలించారు.

అయితే, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన వరుణ్‌కుమార్‌(22) మియాపూర్‌ మాతృశ్రీనగర్‌లో నివాసముంటున్నాడు.

Dell techie dies while working out in gym

ఇతను మాదాపూర్‌లోని డెల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యహ్నం 12గంటల ప్రాంతంలో కంపెనీ ఆవరణలో ఉన్న జిమ్‌కు వెళ్లారు. అక్కడ వ్యాయామం చేస్తూ ఛాతిలో ఒక్కసారిగా నొప్పిరావడంతో అక్కడే కూప్పకూలిపోయారు.

గమనించిన జిమ్‌ నిర్వాహకులు వెంటనే అతడ్ని మాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, వరుణ్ గత రెండు రోజులుగా ఛాతినొప్పితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గుండెపోటుతోనే మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడాది క్రితం నుంచి వరుణ్ ఈ కంపెనీలో పని చేస్తున్నాడని, ప్రతిరోజూ జిమ్ చేస్తుంటాడని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+