స్టే తెచ్చుకునే లోపే కూల్చివేతలు... వణికిస్తున్న హైడ్రా!
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం భాగ్యనగర్ వాసులను హైడ్రా వణికిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ అక్రమ కూల్చివేతల పరంపరను కొనసాగిస్తోంది. హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. తన, పర బేధం లేకుండా ఎంతటి వారివైనా సరే కూల్చుడే అని తేల్చిచెప్తున్నారు. ఏకంగా సీఎం సోదరుడి నివాసాన్ని కూడా కూల్చివేశారు.
గగన్ పహాడ్ ప్రాంతంలో కూల్చివేతలు
మొన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిన్న రాంనగర్, ఈరోజు గగన్ పహాడ్ లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి అప్నాచెరువు ఎఫ్డీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు పాల్పడుతున్నారు. అక్రమ నిర్మాణాల ప్రదేశంలోకి ఇతరులను ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా
అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న హైడ్రా అధికారులు అప్నా చెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు అయితే ఇందులో మూడు ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లను నిర్మించినట్టు గుర్తించారు. మొత్తం 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని నిర్మాణదారులను హెచ్చరించినప్పటికీ వారు స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన హైడ్రా మొత్తం 15 ఎకరాలలో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తుంది.
ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తాం
అయితే హైడ్రా కూల్చివేతలతో బడా బాబులకే కాదు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక హైడ్రా చర్యల పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా వ్యవస్థ కొద్దిరోజులు హడావిడి చేసి ఊరుకునే వ్యవస్థ కాదని ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని పేర్కొన్నారు.
కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తాం
కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతులు ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్ వారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్డిఎల్ పరిధిలోని ప్రతి అపార్ట్మెంట్ కూల్చాలని తమ ఉద్దేశం కాదని, ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నిలవడం చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో ఏవి రంగనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications