నోట్ల రద్దు : అక్రమార్కులా కొత్త పంథా, లంచాలు వెనక్కి!
రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి అక్రమార్కులు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. లంచం తీసుకునే వారు కూడా తాము తీసుకున్న లంచాన్ని తిరిగి ఇస్తున్నారట.
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి అక్రమార్కులు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. లంచం తీసుకునే వారు కూడా తాము తీసుకున్న లంచాన్ని తిరిగి ఇస్తున్నారట. అంతేకాదు, వాటిని కొన్ని రోజుల తర్వాత కొత్త నోట్ల రూపంలో ఇవ్వమని చెబుతున్నారట.
అధికారులు కావొచ్చు లేక నేతలు కావొచ్చు.. తమకు లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇస్తున్నారట. ఎవరైతే తమకు డబ్బులు ఇచ్చారో (రద్దైన పాత నోట్లు) వారిని పిలిపించి, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చి ఐదురు నెలలు తర్వాత ఇవ్వమని చెబుతున్నారట.
తద్వారా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. అధికారులు, నాయకుల నిర్ణయంతో కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. రూటు మారిన అధికారులు, నేతల తీరుతో వారి పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు.

వెనక్కి తీసుకొచ్చిన డబ్బులను ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారట. లంచాల విషయమై కొంతకాలం క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ కొంత సమాచారం సేకరించింది. ఒక రాష్ట్ర పరిధిలో వివిధ శాఖలు చేపట్టే పనులు, జరిపే కొనుగోళ్ల మొత్తంలో 5 నుంచి 7 శాతం వరకు లంచాల లావాదేవీలు జరుగుతున్నట్టు అభిప్రాయపడింది.
కొన్ని పనుల్లో ఇది మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకొన్ని పనుల్లో అసలు ఉండకపోవచ్చని పేర్కొంది. రాష్ట్రాన్ని బట్టి లంచాల రూపంలో చేతులు మారుతున్న సొమ్ము రూ.3 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సంస్థ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications