వామ్మో.. వారంలో 4 జిల్లాల్లో 1000 కేసులు.. కానీ 4 ఆస్పత్రుల్లో కోవిడ్-19 వార్డులు మాత్రం ఖాళీ..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా కొనసాగుతోంది. రోజుకు కనీసం 1500 నుంచి 2000 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని నాలుగు జిల్లా ఆస్పత్రులు మాత్రం ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కానీ కేసులు పెరుగుతుండగా.. జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో రోగులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా 4 ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 వార్డుల్లో ఒక్కరంటే ఒక్క రోగి కూడా కనిపించడం లేదు.

మిగతాచోట్ల ఫుల్.. కానీ ఇక్కడే...
వాస్తవానికి కోవిడ్- 19 వార్డులు నిండి ఉంటాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో గల ఉట్నూర్ ఆస్పత్రి, జోగులాంబ గద్వాల జిల్లాలో గల అలంపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆస్పత్రి, కామారెడ్డి జిల్లాలో గల దోమకొండ ఏరియా ఆస్పత్రిలో మాత్రం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నెలల్లుగా ఆస్పత్రులు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్-19 వార్డులో 143 మంది రోగులకు వసతి కల్పించే చోట ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ నాలుగు జిల్లాల్లో గత వారం రోజుల్లో వెయ్యికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. కానీ వారెవరు ఆస్పత్రిలో చేరలేదు.

ఎందుకు ఇలా జరిగిందంటే..
దీనిపై వైద్యాధికారులు స్పందించారు. వైరస్ సోకిన వారికి అవగాహన లేదు అని.. అందుకే వారు ఆస్పత్రిలో చేరడం లేదని చెబుతున్నారు. అంతేకాదు జిల్లాల్లో మానవ వనరుల కొరత ఉంది అని.. సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. సమస్యపై దృష్టిసారిస్తామని.. త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మౌలిక వసతులు సరిగ్గానే ఉన్నాయని పేర్కొన్నారు.

రిమ్స్‌లో 20 శాతం మంది..
అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. ఉట్నూర్‌లో ఆస్పత్రికి వెళ్లడం లేదు అని.. అయితే రిమ్స్ ఆస్పత్రికి మాత్రం 20 శాతం మంది హాజరవుతన్నారని తెలిపారు. కొందరు మెడికల్ కాలేజీ, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారని చెప్పారు. ఈ ప్రాంతాలు గిరిజనులు ఉండే ఆవాసాలు అని.. వారికి అవగాహన లేకపోవడం వల్ల వినియోగించుకోపోవచ్చు అని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనెజ్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టాప్ కాలేజీ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ సుబోద్ తెలిపారు.

ఐదు బెడ్లు.. అంతకంటే తక్కువగా వినియోగం..
కామారెడ్డిలో కోవిడ్-19 బెడ్లు 40 ఉండే.. ఐదు కంటే తక్కువగా ఉపయోగిస్తున్నారని.. మెదక్‌లో 46 ఉంటే అక్కడ కూడా ఐదు కంటే తక్కువగా యూజ్ చేస్తున్నారని తెలిపారు. మరోవైపు జిల్లా వైద్య సిబ్బందిలో కూడా భయాందోళన నెలకొందని తెలిపారు. కరోనా వైరస్‌తో చనిపోతే.. అంత్యక్రియల కోసం ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. కర్నూలు, నంద్యాల, కడపలో కూడా అంత్యక్రియలు నిర్వహించామని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తాఫా హసన్ ఆస్కారీ తెలిపారు.












Click it and Unblock the Notifications