భర్త మృతిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో రెండో పెళ్లి: డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్

హైదరాబాద్: తన భర్త మృతిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషనుకు వచ్చిన ఓ మహిళను రెండో పెళ్లి చేసుకున్నడిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌పై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. భర్త మృతిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను రెండోపెళ్లి చేసుకున్న దిలావత్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఆయన ఉత్వర్వులు జారీ చేశారు.

స్క్రూ డ్రైవర్‌తో సైకో దాడి

ఇదిలావుంటే, నల్గొండ జిల్లా సూర్యాపేట చర్చిలో ఉన్మాది దాడి చేశారు. స్క్రూడ్రైవర్‌తో ఇద్దరిపై ఉన్మాది దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ఉన్మాదిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Detective inspector suspended for second marriage

డిఎస్పీ దంపతులపై దాడి

బస్టాప్‌లో వేచిఉన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ దంపతులపై కొందరు వ్యక్తులు అకారణంగా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ బి.అంజయ్య, భార్యతో కలిసి గురువారం రాత్రి కోదాడ వెళ్లేందుకు ఎల్బీనగర్ ఆర్టీసీ బస్టాప్‌లో నిలబడ్డారు.

ఇంతలో ఓ కారు డ్రైవర్ వారి వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అకారణంగా పక్కనుండి వచ్చిన మరో వ్యక్తి జోక్యం చేసుకుని అంజయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఎందుకు దాడి చేస్తున్నావని అంజయ్య ప్రశ్నిస్తుండగానే అతడితో కలిసి కారు డ్రైవర్ కూడా దాడిచేశారు.

అడ్డు వచ్చిన అంజయ్య భార్యను కూడా దుర్భాషలాడుతూ చీరను లాగి రోడ్డుపై పడేసి వెళ్లారు. ఈ మేరకు బాధితుడు అంజయ్య ఫిర్యాదు చేయగా ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+