వైభవంగా భద్రకాళీ అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు
హైదరాబాద్: వరంగల్ భద్రకాళీ అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలకు తెలంగాణ దేవాదయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ముఖ్య అర్చకులు భద్రకాళీ శేషు తెలిపారు.
ఈ నెల ఒకటో తేదీ నుంచి 12వ తేదీ ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మవారి సన్నిధానంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపనున్నారు. ఈ శరన్నవరాత్రోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారన్నారు.ఇందులో భాగంగా సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, లఘు శీఘ్ర దర్శనంలకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన కార్యనిర్వాహణ అధికారి అంజనా దేవి తెలిపారు.












Click it and Unblock the Notifications