యాదాద్రి గిరిప్ర‌ద‌క్షిణ‌కు పోటెత్తిన భ‌క్తులు..

తెలంగాణ తిరుప‌తి గా ప్ర‌సిద్ధిచెందిన యాదాద్రి గుట్టకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్య‌క్ర‌మం నిర్వహించారు. నేటి (సోమ‌వారం) ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన ఈ గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల ఈ గిరిప్ర‌దక్షిణ సాగింది. యాద‌గిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జూన్ 18వ తేదిన గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరి గుట్ట‌లోని శ్రీ ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి ఆల‌యం నిలవ‌డం విశేషం..

Devotees flocked to Yadadri Giripradakshina

యాదాద్రి ఆల‌యంలో నేడు జ‌రిగిన ఈ గిరిప్ర‌ద‌క్షిణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ కార్య‌క్ర‌మం సందర్భంగా వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఇరువైపులా, తదితర ప్రాంతాల్లో 2000 మొక్కలు నాటేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

గిరిప్ర‌ద‌క్షిణ కార్యక్ర‌మానికి ముందు వేదమంత్రోచ్ఛరణల నడుమ గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ గిరిప్ర‌ద‌క్షిణ‌కు భ‌క్తులు పోటెత్తారు. గిరిప్ర‌ద‌క్షిణ అనంత‌రం శ్రీ‌ల‌క్ష్మిన‌ర‌సింహాస్వామివారిని ద‌ర్శించుకోవ‌డం ఎప్ప‌టినుంచో ఉన్న అన‌వాయితీ. 2016 సంవ‌త్స‌రంలో ఆల‌య పున‌ర్మిర్మాణం తర్వాత గిరిప్ర‌ద‌క్షిణ కార్య‌క్ర‌మానికి ఆపివేశారు. అయితే, రాష్ట్రంలో కొత్తప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌, తిరిగి ఈ సంప్ర‌దాయాన్నీ తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+