పారిస్ తరహా దాడులను ఎదుర్కోగలం: అనురాగ్ శర్మ, కెసిఆర్‌పై ప్రశంసలు
హైదరాబాద్: తమ పోలీసులు ప్యారిస్ తరహా దాడులను ధీటుగా ఎదుర్కోగలరని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. తమ నిఘా విభాగం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చురుగ్గా ఉందని, వారికి తగిన సాధనసామగ్రి ఉందని ఆయన అన్నారు.రాష్ట్ర శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేదిలేదని ఆయన అన్నారు.
పోలీస్‌శాఖ పారదర్శకంగా, అవినీతిరహితంగా పనిచేస్తే కొత్త రాష్ర్టానికి పునాది బలంగా ఉంటుందని కేసీఆర్ సీఎంగా పదవి చేపట్టకముందే చెప్పారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే పోలీస్‌శాఖ సమస్యల గురించి అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారానికి, ఆధునీకరణకు ఇతోధికంగా కృషిచేస్తున్నారని చెప్పారు. దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని, ఆయన అందించిన తోడ్పాటును ఎన్నిటికీ మర్చిపోలేమని డీజీపీ అన్నారు.

కేవలం పోలీస్ వాహనాల కోసమే రూ.350 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో దాదాపు 3వేలకు పైగా వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. టెక్నాలజీ వినియోగం, విజిబుల్ పోలీసింగ్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.
టీయూడబ్ల్యూజే, ఐజేయూల ఆధ్యర్యంలో బుధవారం స్టేట్ ఆర్కియాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. పోలీస్‌శాఖను అవినీతిలేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కృషిచేస్త్తున్నామని తెలిపారు. పోలీస్‌స్టేషన్ల్లకు ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల రూ.25వేల నుంచి 75వేల వరకు ప్రభుత్వం ఇస్తున్నందువల్ల పోలీస్ సిబ్బందిలో చాలామార్పు వచ్చిందన్నారు.
ఫిర్యాదులు తీసుకుంటున్నసందర్భంగా తమ సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై సర్వే చేయిస్తున్నామన్నారు. ఇటువంటి విధానాలవల్ల జంట కమిషనరేట్ల పరిధిలో అవినీతి 85శాతం తగ్గిందని, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో అవినీతి కేవలం 2శాతం మాత్రమే ఉందని సర్వేలో తేలిందని ఆయన వివరించారు.
డబ్బులు డిమాండ్ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోయిస్ట్టులు, ఐఎస్‌ఐఎస్ కదలికలపై గట్టి నిఘా పెట్టామని, చైన్‌స్నాచర్లను, ఇతర నేరస్థులను నియంత్రించామని ఆయన తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి విధానాలు, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ వినియోగంతో తమ శాఖలో చాలా మార్పు సాధించామని అనురాగ్ శర్మ చెప్పారు.
ఈ-చలాన్ సిస్టమ్, హ్యాక్‌ఐ, సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో నేరాలను అదుపుచేస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే 112 కాల్‌సెంటర్, కంట్రోల్ సెంటర్ పనులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నదని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26వేల మంది సిబ్బంది ఉండగా, 15వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోలీస్ నియామక పద్ధతులను మార్చేందుకు, మహిళలకు 33శాతం కోటా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
త్వరలోనే విభజన సమస్యలకు పరిష్కారం..
రాష్ట్రవిభజన వల్ల పోలీస్‌శాఖ ఎదుర్కుంటున్న సమస్యలు నెలలోపే పరిష్కారం అవుతాయని డీజీపీ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడాపెడా ఇచ్చిన పదోన్నతుల ద్వారా సర్వీస్ సమస్యలు జటిలమయ్యాయని, వాటిని ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులు కూర్చొని పరిష్కరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డీఎస్పీలు, అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీల విభజనను కమల్‌నాథన్ కమిటీ త్వరలో పూర్తి చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications