50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మా ఇంటిపై దాడి చేశారు: ధర్మపురి విజయలక్ష్మి ఫిర్యాదు

హైదరాబాద్: ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై అరవింద్ తల్లి ధర్మపురి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరపున పర్సనల్ అడ్వొకేట్లు, మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

ఈరోజు ఉదయం 11.30 గంటలకు 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మా ఇంటిపై దాడి చేశారు. గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జెండా కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఇంట్లో పనిచేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డు రమణ గాయపడ్డారు. బెంజ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Dharmapuri arvinds mother police complaint on the incident of their house attacked by trs workers

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్న సీపీ

బీజేపీ ఎంపీ అర్విం ద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలర్త దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు.. తెలంగాణ భవన్
ముట్టడిట్ట కి వెళ్లేం దుకు యత్నించారు. వారిని లోటస్పాండ్ వెళ్లే దారిలో.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి సీపీ ఆనంద్‌తో మాట్లాడించారు. అనంతరం బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యం లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ని కలిసేందుకు వెళ్లారు.

ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు. మరికొం దరు బీజేవైఎం కార్యకర్తలర్త ను నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి అబిడ్స్‌కు తరలించారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యా ఖ్యలు చేశారన్న కారణంతో బీజేపీ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్, వాహనాలు ధ్వంసం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+