జగ్గారెడ్డిని కేసీఆర్ కరుణించారా? కలిసింది అందుకేనా? హాట్ టాపిక్!!
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
జగ్గారెడ్డి.. తెలంగాణ రాజకీయాలలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో తనదైన శైలిలో ధిక్కార స్వరాన్ని వినిపించాలన్నా, సొంత పార్టీ నాయకుల పైనే సంచలన వ్యాఖ్యలు చేయాలన్నా జగ్గారెడ్డికే సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన స్వాతంత్రానికి జగ్గారెడ్డి తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తాజాగా మరోమారు జగ్గారెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి భేటీపై పార్టీ వర్గాలలో అనుమానాలు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ ఆసక్తిని రేకెత్తించింది. సంగారెడ్డి వరకు మెట్రో ను పొడిగించాలని విజ్ఞప్తి చేసేందుకు, సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై విజ్ఞప్తి చేసేందుకు సీఎంను కలిశానని జగ్గారెడ్డి చెబుతున్నప్పటికీ, సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి భేటీ పై పార్టీ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానేమి చీకట్లో కేసీఆర్ ను కలవలేదని జగ్గారెడ్డి చెబుతున్నా పార్టీ శ్రేణులలో మాత్రం జగ్గారెడ్డి ఏం చేయబోతున్నారు అన్న చర్చనే ప్రధానంగా జరుగుతుంది.

సీఎం కెసీఆర్ ను జగ్గారెడ్డి అందుకే కలిశారా?
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు తలో దారి అన్నట్టుగా ఉన్న సమయంలో జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ ను కలవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం, అభివృద్ధి పనులపై విజ్ఞప్తి చేయడానికి సీఎంను కలిశానని చెబుతున్న జగ్గారెడ్డికి, మరి సీఎం కేసీఆర్ ప్రసన్నమయ్యారా? జగ్గారెడ్డి పెట్టిన ప్రపోజల్స్ మీద ఆయన పాజిటివ్ గా స్పందించారా? అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభ్యర్థనలను కేసీఆర్ పట్టించుకుంటాడా? జగ్గారెడ్డి నిజంగా అందుకే కలిశాడా అన్న చర్చ సాగుతుంది.

జగ్గారెడ్డి పార్టీ మార్పుపై మళ్ళీ కొత్త చర్చ
ఇదిలా ఉంటే జగ్గారెడ్డి పార్టీ మారతారు, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసహనంతో అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జోరందుకుంది. టిఆర్ఎస్ పార్టీలో లైన్ క్లియర్ అయితే, సీఎం కేసీఆర్ జగ్గారెడ్డికి సంగారెడ్డి టికెట్ ను ఆఫర్ చేస్తే జగ్గారెడ్డి పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక జగ్గారెడ్డి బయటకు వెళ్దాం అన్నా జగ్గారెడ్డిని ఆహ్వానించే పార్టీలేవీ ప్రధానంగా కనిపించడం లేదు.

పార్టీ మార్పు విషయంలో జగ్గారెడ్డి ఊగిసలాట
జగ్గారెడ్డి బిజెపిలో చేరే అవకాశం లేదు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుందాము అన్నా స్థానికంగా ఉన్న బిఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని పార్టీలోకి రాకుండా అడ్డుపడతారు. ఇక ఇలాంటి పరిస్థితులలో జగ్గారెడ్డి చాలాకాలంగా పార్టీ మార్పు విషయంలో ఉగిసలాడుతూనే ఉన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి తీరుతో అసహనంతో ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు సీఎం కేసీఆర్ ను కలవడంతో మళ్లీ పార్టీ మార్పుపై కొత్త చర్చ మొదలైంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications