శివాజీ దెబ్బకు చీర కట్టుకుంటున్న ప్రముఖ నటి కూతురు!
తెలుగు రాష్ట్రాలలో ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపైన నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ దారుణంగా ఉందని చెప్పే క్రమంలో వాడిన అసభ్య పదజాలం మొదట శివాజీ పైన విమర్శలకు కారణం కాగా, ఇక ఈ వివాదంలో చిన్మయి, అనసూయ ఎంట్రీతో ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి శివాజీ కి మద్దతు పెరిగింది.
శివాజీ వ్యాఖ్యల వివాదం.. టార్గెట్ చేసిన నెటిజన్లు
శివాజీ వాడిన పదాలు తప్పు కానీ, ఆయన ఉద్దేశం తప్పు కాదని పలువురి నుండి శివాజీకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అంతేకాదు ఇటీవల కాలంలో పలు ఫంక్షన్లలో యాంకర్లు చీరలు కట్టుకోవడంతో మార్పు మొదలైంది అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఇదే సమయంలో అనసూయను టార్గెట్ చేస్తున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

మహిళల వస్త్రధారణపైన వ్యాఖ్యలు
ఈ మహిళల వస్త్రధారణ వివాదం పైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నా అన్వేషణ నా యూట్యూబ్ ఛానల్ నిర్వహించే అన్వేష్ మహిళల వస్త్రధారణ పైన వ్యాఖ్యలు చేసే క్రమంలో హిందూ దేవతల పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది మరొక వివాదంగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ప్రగతి కూతురు
తాజాగా నటుడు శివాజీకి డ్రెస్సింగ్ లో అనసూయను ఫాలో అయ్యే అరియానా గ్లోరీ సపోర్ట్ ఇవ్వగా, నటి ప్రగతి కూడా ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది.శివాజీకి ఫుల్ సపోర్ట్ చేస్తూ నటి ప్రగతి వ్యాఖ్యలు చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ప్రగతి కూతురు గీత వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అందంలో అమ్మకు పోటీ పడుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రగతి కూతురు సందడి చేస్తుంది.

చీర కట్టుకోవటంపై ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎప్పుడూ వెస్ట్రన్ డ్రెస్ లతో ట్రెండీగా కనిపించే ప్రగతి కూతురు గురించి ప్రగతి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చీర కట్టుకోవడం నా కూతురికి అసలు ఇష్టం ఉండేది కాదని, కానీ శివాజీ వ్యాఖ్యల వలన నా కూతురిలో మార్పు వచ్చిందని, చీర కట్టుకోవటం మొదలు పెట్టిందని ప్రగతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మార్పు మొదలైంది అన్న చర్చ
నేను కూడా ఎప్పుడు అలానే ఉండాలని ఫిక్స్ అయ్యానంటూ నటి ప్రగతి చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యల ప్రభావం సమాజంలో కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ వర్గాల, సెలబ్రిటీలలో కూడా మార్పు వస్తుందని చర్చ జరుగుతుంది. ఇది ఒక మంచి మార్పు అని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications