Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీకు ట్రాఫిక్ చలాన్ లింక్ వచ్చిందా? అయితే తీవ్ర హెచ్చరిక!

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ళ ప్లాన్ లను ఎప్పటికప్పుడు తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా కష్టంగా మారుతుంది. ఇక తాజాగా సైబర్ నేరగాళ్ళు తెలంగాణా ఆర్టీవో పేరుతో ట్రాఫిక్ చలాన్ లింకులు పంపుతూ ప్రజల జేబులు గుల్ల చేసే పనిలో ఉన్నారు.

RTO Traffic Challan.apk పేరుతో లింక్స్
ట్రాఫిక్ చలాన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ APK ఫైళ్లను సృష్టిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో "RTO Traffic Challan.apk" పేరుతో లింక్స్ పోస్ట్ చేస్తున్నారు. నకిలీ వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి అందులో ఈ లింక్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దాని ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే పనిలో పడ్డారు.

అలెర్ట్ అయిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ప్రజలకు హెచ్చరిక
ఈ సైబర్ నేరంపై అలెర్ట్ అయిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను అలెర్ట్ చేస్తుంది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌ల గురించి తెలిస్తే వెంటనే 1930 లేదా 8712672222 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చెయ్యొద్దు అని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను హెచ్చరించింది.

నకిలీ వాట్సాప్ గ్రూపుల ద్వారా ట్రాఫిక్ చలాన్ లింక్స్
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. చలాన్ల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ లింక్‌లను సాయంత్రం వేళల్లో పంపుతున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ఈ APK ఫైల్ మీ SMS లను(OTP లను) యాక్సెస్ చేయగలదని పేర్కొంది. మీ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.

Did you get a traffic challan link But a serious warning from telangana cyber security bureau

Take a Poll

యాప్స్ డౌన్ లోడ్ విషయంలో జాగ్రత్త
అంతేకాకుండా మీ ఫోన్‌ను రిమోట్ కంట్రోల్ మాదిరిగా సైబర్ నేరగాళ్లు నియంత్రించగలరని పేర్కొంది. ఇలాంటి ఫైళ్లు నకిలీవని, OTP లేదా SMS ద్వారా వినియోగదారులను మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఎవరైనా మొబైల్ ఉపయోగించే వారు యాప్స్ డౌన్ లోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే నష్టం
గుర్తు తెలియని, అనధికారిక లింక్‌లను క్లిక్ చేస్తే నష్టం జరుగుతుందని, APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే బ్యాంకుఖాతాలు ఖాళీచేసే ప్రమాదం ఉందని సైబర్ సెక్యూరిటీ పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్టు అనిపిస్తే వెంటనే మీ కార్డును బ్లాక్ చేయాలని సూచించారు. బ్యాంక్ నుండి వచ్చే సందేశానికి, మీరు ఆ లావాదేవీ చెయ్యకుంటే నిలుపుదల చేసేలా తక్షణచర్య తీసుకోవాలని సూచిస్తున్నారు.

గోల్డెన్ అవర్​లో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు సురక్షితం
సైబర్ నేరాల పట్ల ఫిర్యాదు చేయడానికి వెంటనే 1930 కి కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. గోల్డెన్ అవర్​లో ఫిర్యాదు చేయడం వల్ల మీ డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న శిఖా గోయల్ ప్రజలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+