ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదు, బాబే కోట్లు ఖర్చు చేస్తున్నారు: కవిత
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు అన్నారు.
తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే ఫోన్ల ట్యాపింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై పెత్తనం చలాయించని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోన్నారు.

సమైక్య పాలకుల వల్లే అడవులు నాశనం: సుమన్
సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్లే అడువులు నాశనమయ్యాయని టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణలో 33 శాతం ఉన్న అడవులు 24 శాతానికి పడిపోయాయని తెలిపారు.
చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలో అత్యధికంగా 230 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. వచ్చే మూడేళ్లలో రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లిలో 20 లక్షల మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications