ఏంటిది: డిగ్గీ ఆగ్రహం, 'తెలంగాణ ప్రజలు మాత్రం మనకు ఓట్లేశారా'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం నాడు గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నేను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం సూచనలు అడిగితే, మీరు ఆరోపణలు చేసుకుంటారా అని మండిపడ్డారు.
గ్రేటర్ ఓట్ల తొలగింపుపై నేతల మధ్య విభేదాలు
గ్రేటర్ పరిధిలో పలు ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై దిగ్విజయ్ సింగ్ ఎదుట గ్రేటర్ నేతలు వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రా ఓట్లు పోతే మంచిదేనని, వారి ఓట్లు తొలగిస్తే మనం గెలవొచ్చునని ఎమ్మెల్యే విష్ణు అభిప్రాయపడ్డారు.

దీనిపై మరికొందరు గ్రేటర్ నేతలు... విష్ణు వ్యాఖ్యలతో విభేదించారు. మనకు తెలంగాణ ప్రజలు మాత్రం ఓట్లు వేశారా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం సూచనలు ఇవ్వాలని దిగ్విజయ్ నేతలను కోరారు. తన పైన ఫిర్యాదులపై దానం నాగేందర్... డిగ్గీకి వివరణ ఇచ్చారు.
పోటీ చేయను: వివేక్
వరంగల్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్... దిగ్విజయ్ సింగ్‌కు స్పష్టం చేశారు. నీ పైన ఒత్తిడి లేదని, పోటీ చేయాలనుకుంటే చెప్పమని వివేక్‌ను డిగ్గీ అడిగారు. దానికి.. తాను పోటీ చేయనని వివేక్ చెప్పేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications