కేటీఆర్‌కు దిల్ రాజు అదిరిపోయే కౌంటర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.
— Chairman - Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024
ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫ్‌ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అంటూ FDC చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటు మాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందేని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారని తెలిపారు.తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications