ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్..!!
TSRTC: తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే మంటెక్కేలా చేస్తోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఉక్కపోత.. జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. నడి వేసవి రాకముందే ఈ స్థాయిలో ఎండ మండిపోతోంటే.. మున్ముందు మరింత కష్టకాలం తప్పకపోవచ్చు. ఏప్రిల్, మేల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డు అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులు గుడ్ న్యూస్ ఇచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించే సమాచారాన్ని వెల్లడించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలో రాయితీని ప్రకటించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ అమలులో ఉంటుంది.
లహరి ఏసీ స్లీపర్ బస్సులు ప్రస్తుతం హైదరాబద్- చెన్నై, హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- విశాఖపట్నం, హైదరాబాద్- బెంగళూరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తోన్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్- ఆదిలాబాద్, హైదరాబాద్- అసిఫాబాద్, హైదరాబాద్- మంచిర్యాల, హైదరాబాద్- నిర్మల్, గోదావరిఖని- బెంగళూరు, కరీంనగర్- బెంగళూరు, నిజామాబాద్- తిరుపతి, నిజామాబాద్- బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి.
ఆయా బస్ సర్వీసులన్నింట్లోనూ బెర్తులపై వసూలు చేసే ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుంది. ఈ రూట్లలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications