వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభాస్ ను కాదని జూనియర్ తో చర్చలు.!బలమైన ఓటు బ్యాంక్ పై బీజేపి కన్ను.!గ్రేటర్ హైదరాబాదే టార్గెట్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో గులుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతుంది. తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన, ఇటీవల జరిగిన ఉప ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపి జెండా ఎగరేయాలని కమలం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు బీజేపి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video

ఎన్టీఆర్ పొలిటికల్ గా ఆసక్తితో ఉన్నారా?పక్కా ప్లాన్ *Politics | Telugu FilmiBeat
 ఆ సామాజిక వర్గంపై బీజేపి అదిష్టానం కన్ను.. అందుకే జూనియర్ తో మంతనాలు

ఆ సామాజిక వర్గంపై బీజేపి అదిష్టానం కన్ను.. అందుకే జూనియర్ తో మంతనాలు

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బలమైన సమాజిక వర్గం ఓటు బ్యాంకుపై బీజేపి దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఇరవై ఏడు స్థానాల్లో గెలుపును ప్రభావితం చేసే సామాజిక వర్గంపై బీజేపి అదిష్టానం కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకోసం నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలో దించేందుకు బీజేపి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. స్ధానిక నేతలు ఎవ్వరూ కాకుండా నేరుగా కేంద్ర హోంమంత్రి అమీత్ షా రంగంలోకి దిగి జూనియర్ తో చర్చలు జరిపారు. చర్చల సారంశం స్పష్టంగా బహిర్గతం కానప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ను రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకుని అనుకూల ఫలితం రాబట్టాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.

 జూనియర్ ఎన్టీఆర్ తో అమీత్ షా భేటి.. కారణం అదే అంటున్న విశ్లేషకులు

జూనియర్ ఎన్టీఆర్ తో అమీత్ షా భేటి.. కారణం అదే అంటున్న విశ్లేషకులు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలుపుకుని గ్రేటర్ లో ఉన్న మొత్తం 27నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాలన్ని మచ్చిక చేసుకుంటే రాబోవు సాధారణ ఎన్నికల్లో ఈ రెండి జిల్లాల్లో ఫలితాన్ని ఆశించొచ్చనేది బీజేపి ప్రణాళికగా తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ విజయవంతం అయ్యి మంచి ఊపుమీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రజల్లో ఊహించని ఆధరాభిమానం ఉంది. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ప్రభావం ఉంటుందనేది బీజేపి వ్యూహంగా తెలుస్తోంది. అందుకోసం ఎవ్వరూ ఊహించని విధంగా కేంద్ర హోంమంత్రి అమీత్ షా జూనియన్ ఎన్టీఆర్ తో భేటీ నిర్వహించి రాజకీయ సంచలనానికి తెరతీసారు.

 ప్రభాస్ ను కాదని జూనియర్ ఎన్టీఆర్ తో అమీత్ షా మంతనాలు.. సంచలనానికి తెర తీసిన కేంద్ర హోంమంత్రి

ప్రభాస్ ను కాదని జూనియర్ ఎన్టీఆర్ తో అమీత్ షా మంతనాలు.. సంచలనానికి తెర తీసిన కేంద్ర హోంమంత్రి


హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ధీటుగా క్షత్రియ రామాజిక వర్గం కూడా బలంగా ఉంది. నగరంతో పాటు శివార్లలో ఇదే సామిజిక వర్గం ప్రభావవంతంగా పనిచేస్తోంది. గత మున్సిపల్ ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల సమయంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇదే రాజుల సామాజిక వర్గంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో రాజులు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేసారు. ఆ తర్వాత 2018 ముందస్తు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వెలువడ్డాయో అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజుల సామాజిక వర్గ ఓటు బ్యాంకుపై బీజేపి ఎందుకు దృష్టి కేంద్రీకరించలేదనే చర్చ జరుగుతోంది. బాహుబలి సినిమా తర్వాత మంచి దూకుడు మీదున్న ప్రభాస్ ను కాదని అమీత్ షా జనియర్ ఎన్టీఆర్ తో మంతనాలు ఏంటనే గుసగుసలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

 జూనియర్ ఎన్ఠీఆర్ తర్వాత ప్రభాస్ తో భేటీ.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ

జూనియర్ ఎన్ఠీఆర్ తర్వాత ప్రభాస్ తో భేటీ.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ


మొత్తంగా చూసుకుంటే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని బీజేపి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణ భారతంలో బీజేపికి తెలంగాణలో అనుకూల వాతావరణం క్రియేట్ అయ్యింది కాబట్టి దాన్ని కొనసాగింపుగా అన్ని అవకాశాలకు పదునుపెట్టాలని బీజేపి అదిష్టానం వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో విజయంపై కన్నేసిన బీజేపి రాబోవు సాధారణ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మద్దత్తుతో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టి గట్టెక్కాలనేది బీజేపి వ్యూహంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తర్వాత మాజీ కేంద్ర సహాయ మంత్రి, నటుడు క్రిష్ణంరాజు తమ్ముడి కొడుకు హీరో ప్రభాస్ తో కూడా కేంద్ర పెద్దలు భేటీ అవుతారనే చర్చ జరుగుతోంది.

English summary
It seems that the BJP is focusing on the vote bank of the strong community in Hyderabad and Rangareddy districts of Telangana. It seems that the BJP has set its sights on the social class that affects the victory in twenty-seven seats in these two constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X