అసహ్యమేస్తోంది.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా నేచురల్ స్టార్ నాని!
తెలంగాణ మంత్రి కొండ సురేఖ సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసాయి. గతంలో కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయకుండా సమంతను తన దగ్గరికి పంపించాలని అడిగారని, దానికి నాగార్జున, నాగచైతన్య సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని చెబితే అందుకు సమంత అంగీకరించలేదని అందుకే సమంతకు విడాకులు ఇచ్చినట్టు కొండా సురేఖ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపైన స్పందించిన నాని
ఇక ఈ వ్యాఖ్యల దుమారం సినీ, రాజకీయ వర్గాలలో కొండా సురేఖ తీరుపైన తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది. అత్యంత అవమానకరమైన రీతిలో నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు. కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలపైన సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో నాని కొండ సురేఖ వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా తెలివితక్కువ తనం
ఇలాంటి రాజకీయ నాయకులు ఉండడం మనకు దురదృష్టకరమని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చు అని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుందని నాచురల్ స్టార్ నాని అభిప్రాయపడ్డారు. కొండా సురేఖ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నాయని, మీ ప్రజల పట్ల మీకు ఏదైనా బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివి తక్కువ పని అని నాని పేర్కొన్నారు.
మీడియా ముందు నిరాధారమైన మాటలు
ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదని పేర్కొన్న నాని ఇది ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధించింది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడటం సరైనది కాదని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనమంతా కలిసికట్టుగా ఖండించాల్సిన అవసరం ఉందని నాని ట్వీట్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న అక్కినేని ఫ్యామిలీ, సమంత
ఇదిలా ఉంటే మీ హెడ్ లైన్స్ కోసం మా జీవితాలు దొరికాయా అంటూ ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన నాగచైతన్య మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మీ నాయకులను అదుపులో పెట్టుకోవాలని అక్కినేని అమలు సూచించారు. కొండా సురేఖ తమ గురించి చేసిన వ్యాఖ్యలు పూర్హిగా అసంబద్ధం అన్నారు నాగార్జున. అసలు తన విడాకులకు రాజకీయాలతో సంబంధం లేదని, తనను రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం కరెక్ట్ కాదని సమంత కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు.












Click it and Unblock the Notifications