తెలంగాణాకు దిత్వా వార్నింగ్.. ఈ జిల్లాల్లో తీవ్రమైన చలితో పాటు భారీవర్షాలు!

ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను దిత్వ తుఫాను వణికిస్తోంది . బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీరానికి సమీపించడంతో తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీర భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా దిత్వ తుఫాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముఖ్యమైన హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణాలో దిత్వా తుఫాను ప్రభావం.. భారీ వర్షాలు
దిత్వ తుఫాను ప్రభావంతో నేడు పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చలిపులి వణికిస్తోంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం, రాత్రి బయట తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు.

ditwah effect on telangana heavy rains in these district along with intensified cold

ఈ జిల్లాలలో భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు
ఒకపక్క చలి తీవ్రతతో పాటు దిత్వా తుఫాను కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సోమ, మంగళ వారాలలో కూడా కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో పెరిగిన చలి
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనీస ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరుకోగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నేటి నుండి చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

చలితో పాటు, వర్షాలు.. జాగ్రత్త
నిన్న సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 8.3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయిందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెచ్చని ఊలెన్ దుస్తులు ధరించాలని ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు చేయకూడదని చెబుతున్నారు. ఇక వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+