కోట మాది కాదు, కేసీఆర్‌కు చెప్పు: కవితకు అరుణ 'బొమ్మాళీ' కౌంటర్
హైదరాబాద్: తనను గద్వాల కోటలో బొమ్మాళిగా అభివర్ణిస్తూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ ఆదివారంనాడు స్పందించారు.
గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేస్తున్నారు. తనను విశ్రాంతి తీసుకోవాలని కవిత చెప్పడంపై స్పందిస్తూ... ప్రజాప్రతినిధిగా తానెన్నడూ విశ్రాంతి తీసుకోలేదన్నారు. ఆమె తన తండ్రికే ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తే మంచిదన్నారు.
గద్వాలలోని కోట తమది కాదని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో మొండి వైఖరి వీడాలని హితవు పలికారు. గద్వాలను జిల్లాగా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, డీకే అరుణ అని మనకూ ఓ బొమ్మాళి ఉందని, గద్వాల జిల్లా కావాలంటూ హైదరాబాద్‌లో దీక్ష చేస్తూ ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటున్నారని కవిత శనివారం విమర్శించారు. సీఎంపై డీకే అరుణ నోరు పారేసుకోవటం వల్ల అభివృద్ధి జరగదన్నారు.
తెలంగాణ ఆడబిడ్డలందరూ సంస్కారంతో మాట్లాడతారని. అరుణకు ఒక్కటే చెప్పదలుచుకున్నానని, నోరు పారేసుకోకుండా దీక్ష మానేసి గద్వాల్‌లోని మీ కోటలో విశ్రాంతి తీసుకుంటే మంచిదన్నారు. జిల్లాల ఏర్పాటుపై సీఎంకు అన్నీ తెలుసునని చెప్పారు.

జిల్లాల కోసం పోరాటం
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. గద్వాల్, జనగామను జిల్లాలుగా చేయాలని కోరుతూ శనివారం అరుణతో పాటు పొన్నాల లక్ష్మయ్య ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల నిరాహార దీక్షకు దిగారు.

జిల్లాల కోసం పోరాటం
ఈ సందర్భంగా అరుణ మాట్లాడారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని ఆమె విమర్శించారు. అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టామని అన్నారు.

జిల్లాల కోసం పోరాటం
రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని డికె అరుణ అభిప్రాయపడ్డారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు. తాను ఆదివారం సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

జిల్లాల కోసం పోరాటం
జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అరుణ అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని అన్నారు. గద్వాల్ జిల్లా కోసం రెండు నెలలుగా పోరాడుతున్నామని గుర్తు చేశారు.

జిల్లాల కోసం పోరాటం
ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి అరుణ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. వాస్తవాలు మాట్లాడాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు.

జిల్లాల కోసం పోరాటం
ఈ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆమె విమర్శించారు. ప్రజాభీష్టం మేరకు జిల్లాల విభజన చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం దొంగదారిలో నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని డీకే అరుణ హెచ్చరించారు.

జిల్లాల కోసం పోరాటం
ఎన్నికల హామీ మేరకు జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన వల్లే ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications