దళితబంధు అటకెక్కినట్లేనా??: కేసీఆర్‌పై డీకే అరుణ విమర్శలు, రైతుల మరణాలపై రేవంత్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ధన అహంకారం, అధికార దురహంకారాన్ని హుజురాబాద్‌ ప్రజలు ఓటుతో తిప్పికొట్టారన్నారు. కేసీఆర్ ఓట్ల కోసం ప్రజలను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

కేసీఆర్ బూటకపు మాటలు నమ్మలేదు: డీకే అరుణ

కేసీఆర్ బూటకపు మాటలు నమ్మలేదు: డీకే అరుణ

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై స్పందించిన డీకే అరుణ.. కేసీఆర్‌ బూటకపు మాటలను హుజురాబాద్‌ ప్రజలు విశ్వసించలేదన్నారు. ఉపఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికలు వస్తేనే సీఎంకు హామీలు గుర్తొస్తాయని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి అన్నీ మర్చిపోతారని ఎద్దేవా చేశారు డీకే అరుణ.

దళితబంధు అటకెక్కినట్లేనా??: డీకే అరుణ

దళితబంధు అటకెక్కినట్లేనా??: డీకే అరుణ

గతంలో ప్రకటించిన దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించారు. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు అన్నారు. అదీ అమలు కాలేదు. పెన్షన్లు, గొర్రెల పంపిణీ రాష్ట్రంలో ఎక్కడా అమలు చేయకుండా కేవలం ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం హుజురాబాద్‌లో మాత్రమే అమలు చేశాడు. ఆ తర్వాత దళిత బంధు తీసుకొచ్చారు. ఇప్పుడు అది కూడా గాలికి పోయినట్టే. ఎన్నికలయ్యాక మరుసటి రోజు నుంచే దళితబంధు అమలవుతుందని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు ఈ పథకం గురించి చడీ చప్పుడు చేయడం లేదని డీకే అరుణ విమర్శించారు.

కేసీఆర్‌కు మేల్కొలుపు.. హరీశ్ రావుపై డీకే అరుణ విమర్శలు

కేసీఆర్‌కు మేల్కొలుపు.. హరీశ్ రావుపై డీకే అరుణ విమర్శలు

ప్రభుత్వం ఏ ఊరిలో దళితబంధు ప్రారంభించిందో అక్కడే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించలేదనడానికి ఇదే నిదర్శనం. ఎన్నికల కోసం రూ. 100 కోట్లకు పైగా మద్యాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ఏరులై పారించారు. రాష్ట్రంలో ఒక పక్క అప్పులు పెరిగాయి. ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్‌ హుజురాబాద్ తీర్పును మేల్కొలుపుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అరుణ వ్యాఖ్యానించారు. ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి గతంలో హరీశ్ రావు బీజేపీని నిందించారు. కానీ, చమురు ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చడానికి మాత్రం ఆయన వ్యతిరేకించారు. కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోతూ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు వ్యాట్ తగ్గించలేదని డీకే అరుణ మండిపడ్డారు.

రైతుల మరణాన్ని అవమానించొద్దంటూ రేవంత్ రెడ్డి ఫైర్

రైతుల మరణాన్ని అవమానించొద్దంటూ రేవంత్ రెడ్డి ఫైర్

మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతు బీరయ్య మృతి చెందాడనిరేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయ లేదన్న బాధతోనే రైతు మృతి చెందాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట చలికితట్టుకోలేక చనిపోయాడని తెలిపారు. రైతుల మరణాలను అవమానించొద్దని సర్కారుపై మండిపడ్డారు. శనివారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో కలెక్టర్ల నివేదికలకు విలువ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి బానిసలయ్యారని అన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన ప్రభు త్వం అది వదిలేసి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 40వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వాళ్లందరి హత్యలకు సీఎం కేసీఆరే కారణమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచి రైతులు పండించిన ధాన్యానికి మద్ధతు ధర ఇచ్చి కొనాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. పెట్రోల్‌, డీజీల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపా యలు తగ్గించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+