ఆర్టీసీ ఆసుపత్రిలో డీఎన్‌బీ పీజీ మెడికల్ కోర్సులు
హైదరాబాద్ తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డిఎన్‌బి) పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించింది. మూడు విభాగాల్లో ఏడు సీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) మంజూరు చేసింది.
డీఎన్‌బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి కోరుతూ ఎన్‌బీఈఎంఎస్‌కు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ఆసుపత్రిలో పీజీ మెడికల్ కోర్సులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించిన ఎన్‌బీఈఎంఎస్.. జనరల్ మెడిసిన్ 3 సీట్లను, జనరల్ సర్జరీ 2 సీట్లను, ఆర్థోపెడిక్ సర్జరీ 2 సీట్లను మంజూరు చేసింది.

3 సంవత్సరాల పీజీ కోర్సులకు నీట్ ఆధారంగా, 2 సంవత్సవాల డిప్లొమా కోర్సులకు డీఎన్‌బీ-పీడీసీఈటీ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి.
తార్నాక ఆసుపత్రిలో డీఎన్‌బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించడంపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ డీఎన్‌బీ పీజీ కోర్సులకు అనుమతి లభించడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు మరింతగా బలోపేతమవుతాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కోర్సుల వల్ల నాణ్యమైన వైద్యులు ఆసుపత్రిలో ప్రాక్టిస్ చేస్తారని, ఇది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆస్పతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలను అందించి సంపూర్ణ ఆరోగ్య ఆర్టీసీగా మార్చేందుకు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉందని వివరించారు.
డీఎన్‌బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ ఓఎస్‌డీ డాక్టర్ సైది రెడ్డి, డాక్టర్లు సుస్మిత, ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్, రాజ్ కుమార్ లను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి వారిని ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, తదితరులు పాల్గొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications