విషం ఇంజెక్షన్‌తో డాక్టర్ లక్ష్మీ ఆత్మహత్య

హైదరాబాద్: విషం ఇంజెక్షన్ తీసుకొని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఆలస్యంగా హైద్రాబాద్‌లో వెలుగు చూసింది. విశాఖ పట్టణానికి చెందిన డాక్టర్ ఎంవీఏ లక్ష్మి సైనిక్ పురిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొందని మంగళవారం నాడు గుర్తించారు. ప్లాట్‌ నుండి దుర్వాసన వస్తుండడంతో తలుపులు పగులగొట్టి చూస్తే లక్ష్మీ చనిపోయి ఉండడాన్ని గుర్తించారు.

విశాఖపట్టణానికి చెందిన ఎం.నూకరాజు కుమార్తె డాక్టర్‌ ఎంవీఏ లక్ష్మి (42) ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి సైనిక్‌పురిలోని హస్తినాపురిలో ఉన్న జేపీ టవర్స్‌లో మొదటి అంతస్తు జీ2 ఫ్లాట్‌లో ఉంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆమె అసోసియేట్ ప్రోఫెసర్‌గా విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఆమెకు నెలక్రితమే సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి పదోన్నతిపై బదిలీ మీద వెళ్ళారు.

Doctor kills himself with lethal injection

రెండు, మూడు రోజులుగా ఆమె విధులకు హజరు కావడం లేదు. అపార్ట్‌మెంట్లో కూడ ఎవరికీ కన్పించలేదని స్థానికులు చెప్పారు. ఆమె ఊరెళ్ళిపోయిందని స్థానికులు భావించారు. కానీ మంగళవారం నాడు ఆమె ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో వాచ్‌మెన్, మిగిలిన ప్లాట్ల యజమానులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల నుండి గడియ పెట్టి ఉండడాన్ని గుర్తించారు.

పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూశారు బెడ్‌పై లక్ష్మీ మృతదేహం కన్పించింది పక్కనే 2 ఇంజెక్షన్ సీసాలు, సిరంజీలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+