మళ్లీ కాంగ్రెస్-ఎంఐఎం స్నేహం ? ఓవైసీకి ప్రొటెం స్పీకర్ అందుకేనా !
తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓడల్ని బండ్లుగానూ, బండ్లను ఓడలుగానూ మార్చేశాయి. ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ అధికార బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ కాస్తా ఎన్నికలు వచ్చేసరికి దారుణంగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. అక్కడితో రాజకీయం ముగిసిపోలేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో ఆ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉంటూ తమ ప్రయోజనాలు సాధించుకున్న హైదరాబాదీ పార్టీ ఎంఐఎం అధికారం కోల్పోగానే కేసీఆర్ కు హ్యాండిచ్చేసినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో అధికారంలో ఎవరు ఉంటే వారికి మద్దతుగా ఉండే తమ పాత సంప్రదాయాన్ని ఎంఐఎం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే సంకేతాలు అధికార కాంగ్రెస్ కు పంపేయడం, ఆ పార్టీ ఎంఐఎం ఎమ్మెల్యేను అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంచుకోవడం చకచకా జరిగిపోయాయి.

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి కొత్తగా తనతో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం కూడా చేయించేశారు. అయితే మజ్లిస్ కు బద్ధశత్రువైన బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించున్నారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలతో ఓవైసీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ-ఎంఐఎం బంధం బయటపడిందని ఆరోపణలు మొదలుపెట్టేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎంతో మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉండగా ప్రభుత్వం మాత్రం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయం ప్రకారం ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో అందరి కన్నా సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారు. అలాగే అధికార పార్టీ కోరుకున్న వ్యక్తే ప్రొటెం స్పీకర్ అవుతారు. ఈ ఛాన్స్ వాడుకుని కాంగ్రెస్ పార్టీ ఓవైసీకి ప్రొటెం స్పీకర్ చేసేసింది. దీంతో ఇప్పుడు పదేళ్ల తర్వాత కాంగ్రెస్-ఎంఐఎం స్నేహం మళ్లీ తిరిగి చిగురించినట్లు తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications