కుక్క పంచాయితీ .. మహిళలను విచక్షణారహితంగా కొట్టిన కాంగ్రెస్ లీడర్
వారిది ఆస్తుల పంచాయితీ కాదు. డబ్బుల కోసం పడిన గొడవ అంతకంటే కాదు. వేరే ఇతరత్రా కారణాలు కూడా లేవు. కానీ వారు గొడవ పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఒక కాంగ్రెస్ నేత కుక్క కోసం ఇద్దరు మహిళలను చావ చితక్కొట్టారు. ఓ కుక్క పంచాయితీ వారిని రోడ్డుకీడ్చింది . పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేదాకా పోయింది. అసలు ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..
కుక్క పెట్టిన పంచాయితీ .. పోలీస్ స్టేషన్ దాకా చేరిన గొడవ
ఓ కుక్క రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పరం ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకునేలా వివాదం సృష్టించింది. కుక్క తెచ్చిన తంటాతో జరిగిన రచ్చ ఆ కుటుంబాలను రోడ్డు మీద పడేలా చేసింది . పెద్దపల్లి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క పక్కింట్లో బహిర్భూమికి వెళ్లింది. ఇదే విషయాన్ని పక్కింటి మహిళలు...సందీప్‌కు చెప్పారు. అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది . మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహించిన సందీప్ ఇద్దరు మహిళలను విచక్షణా రహితంగా బాదేశాడు .చావ చితక్కొట్టాడు.

కుక్క కోసం ఇద్దరు మహిళల్ని చావబాదిన కాంగ్రెస్ నేత
ఇరుగు పొరుగు వారు సర్దిచెబుతున్నప్పటికీ సందీప్ ఆగలేదు. ఎవరు అడ్డు పడుతున్నా మహిళలపై తన ప్రతాపాన్ని చూపించాడు .అక్కడ ఉన్న వారు సందీప్ మహిళలపై చేస్తున్న దాడిని తమ సెల్ ఫోన్ లలో బంధించారు . ఎవరు అడ్డుకున్నా ఆగకుండా , వారు క్రింద పడిపోయినా వదలకుండా సందీప్ పిడిగుద్దులు గుద్దాడు . వాళ్ళు అరుస్తున్నా , ఏడుస్తున్నా వదలకుండా మహిళలను వీరబాదుడు బాదాడు.

వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు
సందీప్ మహిళల మీద పడి గొడ్డును బాదినట్లు బాదేశాడు. ఇక సందీప్ మహిళలపై చేసిన దాడి వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా మహిళలు అన్న విచక్షణ కూడా లేకుండా గొడ్డును బాదినట్టు బాదుతుండటం చూసి అవాక్కయ్యారు. కేవలం కుక్క కోసం ఇంతగా దాడి చేస్తున్నాడా అని నివ్వెరపోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications