హైదరాబాదీలకు శుభవార్త.. ఆ మార్గాల్లో డబుల్ డెక్ కారిడార్.. కేంద్రం తీపికబురు!

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ నగర విస్తరణ ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతుంది. రోజురోజుకూ వాహనాలు పెరగటం కూడా నగర ట్రాఫిక్ సమస్యను బాగా పెంచింది. ఈక్రమంలో హైదరాబాద్ లో మెట్రో అందుబాటులోకి వచ్చింది. అయినా ఇప్పుడు వాహనాల రద్దీని తగ్గించేందుకు మళ్ళీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను సమన్వయంతో అభివృద్ధి చేసే దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు.

చందానగర్-గంగారం ఫ్లైఓవర్‌పై డబుల్ డెక్ డిజైన్ ఖరారు

మెట్రో రైలుకు, ఇంకో రోడ్డు మార్గానికి ప్రత్యేకంగా భూసేకరణ ఇబ్బంది లేకుండా, డబుల్ డెక్ ఉండేలా ప్లాన్ చేశాయి. హైదరాబాద్ నుంచి ముంబయి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో చందానగర్-గంగారం ప్రాంతం వద్ద ఫ్లైఓవర్‌పై మెట్రో వయాడక్ట్‌ ఉండేలా డబుల్‌డెక్‌ డిజైన్‌ను జాతీయ రహదారుల సంస్థ , హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ కలిసి ఖరారు చేశాయి.

Double Decker corridor NHAI HMRL finalise double-decker design for hyderabad Chandanagar-Gangaram stretch

మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు డబుల్ డెక్ ప్లాన్

మరోవైపు మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు కూడా మెట్రో విస్తరణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో, ఇదే కారిడార్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరుగుతోంది. రెండు ప్రాజెక్టులను వేర్వేరుగా చేస్తే భూసేకరణ, స్థల లభ్యత, ఖర్చు కూడా పెరుగుతాయని గుర్తించి, ఒకే నిర్మాణంలో కింద ఫ్లైఓవర్, పైన మెట్రో వయాడక్ట్‌ ఉండేలా ఈ డిజైన్‌ రూపొందించారు.

ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలోనూ డబుల్ డెక్ పై మంత్రి కోమటిరెడ్డి

నాగ్‌పూర్‌లో ఇలాంటి డబుల్‌డెక్‌ కారిడార్‌ ఇప్పటికే పని చేస్తున్నట్టు, ఈ విధానంలో పరిమిత స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవడం సాధ్యం అవుతుందని అంచనా. అంతేకాదు ఖర్చు కూడా తగ్గుతుంది. మరోవైపు ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలోనూ డబుల్‌డెక్‌ నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు.

ఇప్పటికే సర్వీస్ రోడ్ వెంట ఖరారైన ఎల్బీనగర్-హయత్‌నగర్ మెట్రో

అయితే అక్కడ మెట్రో అలైన్‌మెంట్‌ ఇప్పటికే సర్వీస్ రోడ్డు వెంట ఖరారై ఉంది. DPR కేంద్రానికి చేరినందున మార్పులు చేస్తే ఆలస్యం, అదనపు వ్యయం రావచ్చని అధికారులు సూచిస్తున్నారు.ఒకవేళ కేంద్రం ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని భావిస్తే ఈ డీపీఆర్ కూడా మారే అవకాశం ఉంది.

తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!

డబుల్ డెక్ నిర్మాణాలు చేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర అనుమతులు త్వరలో రావచ్చన్న అభిప్రాయం ఉన్న క్రమంలో మెట్రో మార్గాలలో డబుల్ డెక్ నిర్మాణాలను ఏకకాలంలో చేపడితే అటు రోడ్డు మార్గం,ఇతి మెట్రో రైలు మార్గం రెండూ అందుబాటులోకి వచ్చి హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+