తాగునీటి సంక్షోభంలో హైదరాబాద్... ఆధారాలతో సహా చెప్పిన మాజీమంత్రి!

హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎండాకాలం ప్రారంభంలోనే హైదరాబాద్ వాసులకు తాగునీటి కటకట తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. గణాంకాలతో సహా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితిని హరీష్ రావు వెల్లడించారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు
కెసిఆర్ పాలనలో హైదరాబాద్ నగరం ఇటువంటి తాగునీటి సంక్షోభాన్ని ఎప్పుడు చూడలేదని, కానీ ఇప్పుడు వేసవి ప్రారంభానికి ముందే బోర్లు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పుడే నీళ్ల ట్యాంకర్లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని ముందు ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

drinking water crisis in Hyderabad Former minister harish rao targets congress govt

కాంగ్రెస్ పాలనలో నీటి సంక్షోభం
కాంగ్రెస్ పాలనలో నీటి సంక్షేమం ఏర్పడిందని చరిత్ర చెబుతుందని, ఇప్పుడు ఇది మళ్ళీ నిరూపితమైందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని 2.88బిలియన్ క్యూబిక్ మీటర్లు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి అన్నారు. దేశంలోనే అత్యంత దారుణమైన క్షీణతలలో ఇది ఒకటని పేర్కొన్నారు. హైదరాబాదులో 15% అధిక వర్షపాతం పడినప్పటికీ భూగర్భ జలాలు 1.33 మీటర్లు పడిపోవడం దారుణం అన్నారు.

కూకట్ పల్లిలో పరిస్థితి దారుణం
ఇక కూకట్పల్లిలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని అక్కడ భూమికి 25.90 మీటర్ల దిగువన భూగర్భ జలాలు పడిపోయాయని హరీష్ రావు పేర్కొన్నారు అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ పైపుల ద్వారా మంచినీటిని అందించామని మిషన్ కాకతీయతో వేలాది చెరువులను పునరుద్ధరించామని గుర్తు చేశారు.

కాంగ్రెస్ కు తాగునీటి సమస్యల పట్టింపేది
కానీ కాంగ్రెస్ హయాంలో నీటి వనరులు ఎండిపోతున్నాయని వారు అన్ని విధాలుగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వీయ ప్రమోషన్లలో, రాజకీయ ప్రతీకారంతో బిజీగా ఉందని, ప్రజల తాగునీటి సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత నుంచి పారిపోతుందని హైదరాబాద్ ఎండిపోతున్నా పట్టింపు లేని తీరు వారి పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+