హైదరాబాద్‌ మరవకముందే.. నిజామాబాద్ లోను బయటపడ్డ డ్రగ్స్ మాఫియా!

గంజాయితో తయారుచేసిన మధుమునక్కా చాక్లెట్లను పోలీసులు అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకునే శరత్.. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా కలకలం పూర్తిగా బట్టబయలు కాకముందే.. నిజామాబాద్ లోను మరో డ్రగ్ దందా వెలుగుచూసింది. మత్తు పదార్థాలను చాక్లెట్ల రూపంలో తయారుచేస్తున్న శరత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

గంజాయితో తయారుచేసిన మధుమునక్కా చాక్లెట్లను పోలీసులు అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకునే శరత్.. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు పక్కా ప్లాన్ తో అతన్ని పట్టుకున్నారు. దీని వెనకాల ఇంకెంతమంది ఉన్నారనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

drug mafia busted in nizamabad also

టీనేజ్ యువతను టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు వెయ్యి మంది టీనేజీ యువత డ్రగ్స్ బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలుగా ఏర్పడుతున్న డ్రగ్స్ మాఫియా.. టీనేజర్లను ఆకర్షిస్తూ వారిని మత్తులో ముంచెత్తుతున్నారు.

తమ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అనుమానం కలిగితే వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు చెబుతున్నారు. మూత్ర పరీక్షల ద్వారా దీన్ని నిర్దారించవచ్చునని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+