బర్త్ డే పార్టీలో డ్రగ్స్, 51మంది అరెస్ట్, సెలబ్రిటీలకు టెన్షన్!
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన బర్త్ డే పార్టీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ బర్త్ డే పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ బకారంలో ఒక పార్టీలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడివారిని అరెస్టు చేశారు.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన నైజీరియా, ఉగాండా కు చెందినవారు
మొత్తం 51 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరిలో నైజీరియా, ఉగాండా కు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు గుర్తించారు. వీరంతా విదేశీ డ్రగ్ పెడలర్లుగా వారు అనుమానిస్తున్నారు. మొత్తం వారిలో 37 మంది మహిళలు కాక 14 మంది పురుషులు. వీరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా చాలామందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది.

బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, మాదకద్రవ్యాలు
ఉగాండా కు చెందిన మమస్ బర్త్ డే పార్టీలో వీరంతా డ్రగ్స్ ఉపయోగిస్తూ పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పార్టీకి వచ్చిన వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి పాస్పోర్ట్ లను, వీసాలను ఇమిగ్రేషన్ అధికారులతో చేయిస్తున్నారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుకున్నట్టు తేల్చారు .
భారత్ లో అక్రమంగా నివసిస్తున్న వారు... చట్టపరమైన చర్యలు
ఇక్కడ డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో 51 మందికి పోలీసులు పరీక్షలు నిర్వహించారు. వీరందరిని ఎస్వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరందరి వీసాలను పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు చాలామంది వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్లో కొనసాగుతున్నట్టు గుర్తించారు. అక్రమ నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
డ్రగ్స్ గ్యాంగ్ పట్టుబడటంతో సెలబ్రిటీల టెన్షన్
ఇక సంఘటన స్థలం నుంచి పోలీసులు 65 బీర్ బాటిళ్లు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో 12 మందికి పైగా స్టూడెంట్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ డ్రగ్ డీలర్లు పట్టుబట్టడంతో సెలబ్రిటీల గుండెల్లో వణుకు పుడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరు లాగా డ్రగ్స్ వినియోగిస్తూ ఉంటారు. ఇప్పటికే అనేకమార్లు టాలీవుడ్లో సెలబ్రిటీల డ్రగ్స్ వ్యవహారం బయటకు రాగా, తాజాగా ఇంతమంది డ్రగ్ డీలర్లు పట్టుబట్టడంతో వారు ఎవరెవరి పేర్లు బయటపెడతారు అన్నది ఉత్కంఠగా మారింది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ!












Click it and Unblock the Notifications