Raghunandan Rao: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫామ్ హౌస్ లీలలు, ఫామ్ హౌస్ డబ్బుల పేరుతో సినిమా తీశారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులపై విచారణ చేయాలని EDకి ఫిర్యాదు చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు. 26వ తేదీ ఉదయమే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. సంచుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పారు. మరి ఆ డబ్బులు ఏమయ్యాయని రఘునందన్ రావు ప్రశ్నించారు.
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తడిబట్టలతో ప్రమాణం చేసి తన నిజాయితీ నిరూపించుకున్న శ్రీ @bandisanjay_bjp pic.twitter.com/4eTiaEUWIz
— BJP Telangana (@BJP4Telangana) October 28, 2022
బండి సంజయ్ ప్రమాణం
ఇందుకు సబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. బండి సంజయ్ యాదాద్రి వెళ్తున్న క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సంజయ్ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఆడియో కాల్స్ లీక్
అయితే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆడియోలు ఒకదాని తర్వాత ఒకటి లీక్ అవుతున్నాయి. ఈ ఆడియోలు ఎవరు లీక్ చేస్తున్నారో తెలియడం లేదు. రామచంద్ర భారతి రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఎమ్మెల్యేలు తమకు కావాలని.. ఒకరిద్దరు వస్తే బాగుంటుందని రామచంద్ర భారతి రోహిత్ రెడ్డితో అన్నారు. అందుకు రోహిత్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. తమ సీఎం కేసీఆర్ గురించి తెలుసు కదా అన్నారు. ఆయన చాలా దూకుడుగా ఉంటారని.. తమకు ప్రాబ్లమ్ అవుతుందని పేర్కొన్నారు. తమ ఫ్యూచర్, కెరీర్ నాశనం అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఆడియో కాల్ లీక్ అయింది.












Click it and Unblock the Notifications