దావోస్ పర్యటన వేళ.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషపై రచ్చ!!

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణాకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన ఆయన, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తున్నారు.

అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న వేళ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో, అలాగే ఇతర సందర్భాల్లో మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో క్లిప్పింగ్స్ ను, రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియోలను పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు.

During Davos visit. trollings on CM Revanth Reddy English language!!

అలాగే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డిని, గతంలో దావోస్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ను కూడా పోల్చి చూపిస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసమర్ధుడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ లో రేవంత్ రెడ్డి తనను తాను నవ్వుల పాలు చేసుకుంటున్నారని, ప్రపంచ వేదికపై అసంబద్ధమైన, అసమర్థమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి తల వంపులు తీసుకువస్తున్నారని బి ఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.

ముఖ్యంగా దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాష పై ప్రస్తుత ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ రాష్ట్ర సీఎంకు ఇంగ్లీష్ భాష అనివార్యమే .. అయినా సరైన ఇంగ్లీష్ మాట్లాడలేక పోవడం వల్ల తెలంగాణను ప్రపంచం తక్కువగా చూస్తుందా అన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది.

అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి రేవంత్ రెడ్డి కి కావలసిన పరిపాలన దక్షత ఉందని, ముఖ్యమంత్రి కావాల్సింది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మాత్రమే కాదని రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలను తిప్పి కొడుతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ పై పెద్ద చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+