మహిళలకు శుభవార్త.. రైస్ మిల్లులు, గోడౌన్ లు నడిపేది మీరే!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా పురోగతి బాటలో నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. ఇందిర మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు వేలకోట్ల వడ్డీలేని రుణాలను ఇస్తూ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే విధంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

మహిళా సంఘాలతో రైస్ మిల్లులు, గోడౌన్ లు
ఇందులో భాగంగా మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ లను ఏర్పాటు చేయడంలో స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతునిస్తోంది. ఇక రైస్ మిల్లులు, గోడౌన్లు ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు భూములను కేటాయించడంతో పాటు సహాయం కూడా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

dwcra women to run rice mills and godowns revanth govt support to shg women

Take a Poll

తాజాగా శుభవార్త చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిన్న నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.

నల్గొండలో పైలట్ ప్రాజెక్ట్ త్వరలో
స్వయం సహాయక మహిళా సంఘాల చేత రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పైలెట్ పద్ధతిలో ముందుగా నల్గొండ జిల్లాలో వీటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఉపాధి పొందడానికి ప్రభుత్వ సహకారాన్ని అందిస్తుంది.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ప్లాన్
మరోవైపు మహిళలతో బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దెకు బస్సులను పెట్టించి, మహిళా సంఘాల ద్వారా నిర్వహించేలా చేస్తూ వారి ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ఇక తాజాగా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం మహిళా సంఘాల చేత రైస్ మిల్లులు, గోడౌన్లు ఏర్పాటు చేయించడానికి కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళుతుంది. ఏది ఏమైనా తెలంగాణ సర్కార్ మహిళా పురోగతికి, మహిళల ఆర్థిక భరోసాకు చేస్తున్న ఈ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+