Earthquake: తెలంగాణలో పలు చోట్ల భూ ప్రకంపనలు, భయంతో జనం పరుగులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్ తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 సెకన్లపాటు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో పలుచోట్ల ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి.
తెల్లవారుజామున నిద్రలో ఉన్న ప్రజలు భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సెకన్లపాటు భూమి కంపించడంతో ఏం జరుగుతోందనని భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది.

భూకంప కేంద్రం 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకటించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగాపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే మణుగూరులో రెండుసార్లు భూమి కంపించింది. ఆగస్టు 19న కూడా మణుగూరులో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇలా వరుస ప్రకంపనలు వస్తుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భూప్రకంపనలు రావడంపై భూకంప అధ్యయన నిపుణులు స్పందించారు.
Earthquake of Magnitude:3.6, Occurred on 25-08-2023, 04:43:11 IST, Lat: 18.04 & Long: 80.80, Depth: 30 Km ,Location: 127km E of Warangal, Telangana, India for more information Download the BhooKamp App https://t.co/zWYrykFgwj@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/LQ9dsnoOCP
— National Center for Seismology (@NCS_Earthquake) August 24, 2023
భూమి లోపలి పొరల్లో అమరికల కారణంగా సాధారణంగానే భూ ప్రకంపనలు వస్తాయని.. ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని చెబుతున్నారు. మరోవైపు, సింగరేణి బొగ్గు గనుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య బ్లాస్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటి కారణంగా కూడా భూమి కంపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications