ప్రారంభమైన ఎన్నికల సంఘం తాఖీదులు, ఎవరెవరికి ఇచ్చారంటే?
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు ప్రారంభమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెరాస నేత హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గజ్వెల్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈసీ నోటుసులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు.. హరీష్ రావు పైన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు, కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పరుషపదజాలం ఉపయోగించారని తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. ఇందుకుగాను వీరికి నోటీసులు ఇచ్చింది. ఇటీవల టీడీపీ నేత రేవూరి కూడా హరీష్ రావు, కేసీఆర్‌లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయనకు నోటీసులు పంపించారు.
మరోవైపు, ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పైన ఈసీ నిషేధం విధించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చత్తీస్‍గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. మిగతా రాష్ట్రాలకు దశల వారిగా జరగనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలకు వచ్చే నెల 7న పోలింగ్ జరగనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications